ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: బీజేపీ రెండో లిస్ట్‌లో గడ్కరి, ఖట్టార్, పీయూష్ గోయల్

ABN, Publish Date - Mar 13 , 2024 | 07:51 PM

లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండవ జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారంనాడు ప్రకటించింది. 72 మందితో జాబితా విడుదల చేసింది. నితిన్ గడ్కరి, మనోహర్ లాల్ కట్టార్, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, తేజస్వి సూర్య వంటి ప్రముఖులకు ఈ జాబితాలో చోటు దక్కింది.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీచేసే అభ్యర్థుల రెండవ జాబితా (Second List)ను భారతీయ జనతా పార్టీ (BJP) బుధవారంనాడు ప్రకటించింది. 72 మందితో జాబితా విడుదల చేసింది. నితిన్ గడ్కరి (Nitin Gadkari), మనోహర్ లాల్ కట్టార్ (Manoharlal Khattar), అనురాగ్ ఠాకూర్ (Anurag Thagur) పీయూష్ గోయల్ (Piyush Goel), తేజస్వి సూర్య (Tejaswi Surya) వంటి ప్రముఖులకు ఈ జాబితాలో చోటు దక్కింది.


హర్యానా సీఎంగా మంగళవారంనాడు రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టార్‌కు పార్టీ అధిష్ఠానం కర్నాల్‌ లోక్‌సభ సీటు కేటాయించింది. తొలి జాబితాలో చోటు దక్కని కేంద్ర మంత్రి, బీజేపీ దిగ్గజ నేత నితిన్ గడ్కరికి మరోసారి నాగపూర్ సీటు కేటాయించారు. పీయూష్ గోయల్‌ ముంబై నార్త్ నుంచి పోటీ చేయనున్నారు.


ప్రముఖుల్లో...

కాగా, రెండో జాబితాలో చోటుచేసుకున్న మరికొంత మంది ప్రముఖులలో అశోక్ తన్వర్ (సిర్సా), చౌదరి ధరమ్‌బీర్ సింగ్ (భివానీ -మహేంద్రగఢ్), రావు ఇంద్రజిత్ సింగ్ యాదవ్ (గురుగావ్), అనురాగ్ సింగ్ ఠాకూర్ (హమీర్‌పూర్), బీవై రాఘవేంద్ర (షిమోగా), బసవరాజ్ బొమ్మై (హవేరి), శోభా కరండ్లాజే (బెంగళూరు నార్త్), తేజస్వి సూర్య (బెంగళూరు సౌత్), భారతి ప్రవీణ్ పవార్ (దిండోరి), పంకజ్ ముండే (బీడ్), డీకే అరుణ (మహబూబ్ నగర్), త్రివేంద్ర సింగ్ రావత్ (హర్‌ద్వార్) తదితరులు ఉన్నారు. కాగా, 195 మందితో బీజేపీ ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో ప్రధాన మోదీ (వారణాసి), అమిత్‌షా (గాంధీనగర్), రాజ్‌నాథ్ సింగ్ (లక్నో), స్మృతి ఇరానీ (అమేథీ) తదితరులున్నాయి.

Updated Date - Mar 13 , 2024 | 08:15 PM

Advertising
Advertising