ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐదేళ్లలో ఏడేళ్లు ఎలా పెరిగాడో?

ABN, Publish Date - Nov 02 , 2024 | 03:15 AM

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ వయసు వివాదాంశం అయింది. ఐదేళ్లలో ఏడేళ్లు పెరిగాడంటూ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

  • జార్ఖండ్‌ సీఎం హేమంత్‌పై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు

కోల్‌కతా, నవంబరు 1: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ వయసు వివాదాంశం అయింది. ఐదేళ్లలో ఏడేళ్లు పెరిగాడంటూ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్‌లో సోరెన్‌ తన వయసు 42 ఏళ్లు అని పేర్కొనగా.. ఇప్పుడు 49 ఏళ్లు అని ప్రకటించారు. దీంతో ఈ విషయంపై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్‌ షా దేవ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఐదేళ్లలో ఎవరికైనా ఏడేళ్లు పెరగడం మీరెప్పుడైనా విన్నారా. ఇది జార్ఖండ్‌లో మాత్రమే సాధ్యం’’ అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై జేఎంఎం అధికార ప్రతినిధి తనూజ్‌ ఖత్రి ప్రతిస్పందించారు. అఫిడవిట్‌తో సమర్పించిన డాక్యుమెంట్లు హేమంత్‌ సోరెన్‌ వయసును నిర్ధారిస్తున్నాయని, ఇపుడు ఆయన వయసు 49 అని స్పష్టం చేశారు.

Updated Date - Nov 02 , 2024 | 03:15 AM