ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP state president: అధిష్టానం అనుమతితో ఎవరైనా పాదయాత్ర చేయొచ్చు..

ABN, Publish Date - Aug 14 , 2024 | 01:30 PM

కూడల సంగమ నుంచి బళ్లారి దాకా ప్రత్యేక పాదయాత్ర చేస్తే తనకు అభ్యంతరం లేదని, అధిష్టానం అనుమతితో ఎవరైనా పాదయాత్ర చేయొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) స్పష్టం చేశారు.

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర

బెంగళూరు: కూడల సంగమ నుంచి బళ్లారి దాకా ప్రత్యేక పాదయాత్ర చేస్తే తనకు అభ్యంతరం లేదని, అధిష్టానం అనుమతితో ఎవరైనా పాదయాత్ర చేయొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) స్పష్టం చేశారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీకి చెందిన కొందరు ముఖ్యులు బెళగావిలో రహస్య సమావేశం నిర్వహించడంపై స్పందించారు. కొందరు ప్రత్యేక పాదయాత్ర చేయాలని భావిస్తున్నారని, పార్టీకి శక్తి లభించేలా ఉంటే అధిష్టానం పెద్దలు అనుమతిస్తారని, ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.

ఇదికూడా చదవండి: Chennai: తమిళనాడులోనూ బీజేపీ తెలంగాణ ఫార్ములా !


ఢిల్లీ నేతలను కలుస్తామని ప్రకటించారని, పార్టీ ముఖ్యులతో భేటీ అయ్యేందుకు వారు స్వతంత్రులని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొనిపోయే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. సీపీ యోగేశ్వర్‌(CP Yogeshwar) ఢిల్లీ వెళ్లిన విషయమై స్పందిస్తూ ఆయన చెన్నపట్టణ అభ్యర్థి కావాలని ప్రచారం చేసుకున్నారని తెలిపారు. అది తప్పు అని చెప్పలేనని అన్నారు. నియోజకవర్గంలో ఆయనకు పట్టు ఉందన్నారు.


బీజేపీ-జేడీఎస్‌(BJP-JDS) కలసి రాజకీయాలు చేస్తున్నందున అభ్యర్థి విషయంలో సమష్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పైగా కుమారస్వామి విజయం సాధించిన నియోజకవర్గం అన్నారు. ఎవరికి టిక్కెట్‌ ఇవ్వాలనేది అగ్రనేతలు నిర్ణయిస్తారని తెలిపారు. పార్టీ నేతలు మాజీ డీసీఎం అశ్వత్థనారాయణ నేతృత్వంలోని కమిటీ అభిప్రాయం తీసుకున్నారని వివరించారు. ఎమ్మెల్యే బీపీ హరీశ్‌ రోజుకోమాట మాట్లాడతారని, అతడిలా దిగజారలేనని అన్నారు.


దికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2024 | 01:30 PM

Advertising
Advertising
<