BJP state president: నేనెవరి కాళ్లూ పట్టుకుని పదవిలోకి రాలేదు..
ABN, Publish Date - Aug 27 , 2024 | 01:19 PM
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిలాగా దోక్కుంటూ వెళ్లి ఎవరి కాళ్లూ పట్టుకుని పదవిలోకి రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) కౌంటర్ ఇచ్చారు.
- ఈపీఎస్‌కు అన్నామలై సీరియస్ కౌంటర్
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిలాగా దోక్కుంటూ వెళ్లి ఎవరి కాళ్లూ పట్టుకుని పదవిలోకి రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఉదయం సేలంలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఈపీఎస్ విలేకరులతో మాట్లాడుతూ... కష్టపడకుండానే అన్నామలై బీజేపీ అధ్యక్ష పదవిని పొందారంటూ విమర్శించారు. దీనిపై చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో అన్నామలై కౌంటర్ ఇచ్చారు. ఎంజీఆర్, జయలలిత నాయకత్వం వహించిన అన్నాడీఎంకే ప్రస్తుతం లేదని, ఆ పార్టీ టెండర్ల పార్టీగా మారిపోయిందని, ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఈపీఎస్ కూవత్తూరు శిబిరంలో ఎవరి కాళ్లను పట్టుకుని పదవిని పొందారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
ఇదికూడా చదవండి: Minister: మావి సరదా మాటలే.. రజనీకాంత్‌తో స్పర్థల్లేవు!
తాను నిజాయితీ కలిగిన ఐపీఎస్ అధికారిగా సేవలందించిన తర్వాతే బీజేపీలో చేరి పార్టీ అభివృద్ధికి శాయశక్తులా పాడుతున్నానని, అధిష్ఠానం మెప్పు పొందిన మీదటే పదవిలోకి వచ్చానన్నారు. ఈపీఎ్‌సలాగా ఎవరి కాళ్లూ పట్టుకోలేదని యెద్దేవా చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నాలుగో స్థానానికి పతనమవడం ఖాయమన్నారు. పాలకపక్షం డీఎంకేతో బీజేపీ రహస్యంగా పొత్తు కుదుర్చుకుందంటూ ఈపీఎస్ అదేపనిగా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. డీఎంకే తమ పార్టీ ఎప్పుడూ పొత్తు కుదుర్చుకునే అవకాశమే లేదని, కాంగ్రెస్ పార్టీలా తాము ఆ పార్టీకి బానిసలం కాదని అన్నామలై అన్నారు.
ఇదేమి చోద్యం...
గత యేడాది సనాతన ధర్మ వ్యతిరేక మహానాడులో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు, ఈ యేడాది జరిగిన ముత్తమిళ్ మురుగన్ మహానాడుకు అధ్యక్షత వహించడం వింతగా విడ్డూరంగా ఉందని, పదేపదే ద్రావిడ తరహా పాలన అందిస్తున్నామని ప్రకటనలు చేస్తున్న డీఎంకే నాయకులకు కూడా మింగుడు పడని విధంగా ఈ రెండు సంఘటనలు రాష్ట్రంలోనే చోటుచేసుకున్నాయని అన్నామలై విమర్శించారు. నగరంలో ద్రావిడ కళగం జరిపిన సనాతనధర్మం వ్యతిరేక మహానాడు ఫొటోను, పళనిలో జరిగిన ముత్తమిళ్ మురుగన్ మహానాడు ఫొటోను జతకలిపి తన ఎక్స్‌పేజీలో ఆయన వెలువరించారు.
ఆధ్యాత్మిక భావాలకు వ్యతిరేకంగా సాగుతున్న తమ పాలనపై ప్రజాగ్రహం అధికమైందన్న భయంతోనే ఉన్నట్టుండి మురుగన్ మహానాడును నిర్వహించారని ఆరోపించారు. అయితే సనాతన ధర్మం వ్యతిరేక మహానాడు జరిపినవారే తనకోసం మహానాడు నిర్వహించారనే విషయాన్ని తమిళుల ఆరాధ్యదైవం మురుగప్పెరుమాన్ నిశితంగా పరిశీలిస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నామలై చెప్పారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 27 , 2024 | 01:19 PM