ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం..

ABN, Publish Date - Dec 17 , 2024 | 11:29 AM

వరద బాధితులను ఆదుకోవడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆరోపించారు. టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన కమలాలయంలో సోమవారం ఉదయం అన్నామలై అధ్యక్షతన పార్టీ కేంద్ర కమిటీ నిర్వాహకుల సమావేశం జరిగింది.

చెన్నై: వరద బాధితులను ఆదుకోవడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆరోపించారు. టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన కమలాలయంలో సోమవారం ఉదయం అన్నామలై అధ్యక్షతన పార్టీ కేంద్ర కమిటీ నిర్వాహకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీలంక, బెహ్రైన్‌ తదితర దేశాల్లోని జైళ్లలో ఖైదీలుగా ఉన్న తమిళుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రాష్ట్రంలో బీజేపీ(BJP) బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, 2026లో రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో స్థానిక పార్టీలతో పొత్తు తదితర అంశాలపై చర్చించారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: ఎయిర్‌షోలో సందర్శకుల మృతికి ఎవరు బాధ్యులు...


ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల గురించి వాతావరణశాఖ ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ హైకమాండ్‌ ఇన్‌ఛార్జులు అరవింద్‌ మేనన్‌, పొంగులేటి సుధాకర రెడ్డి(Ponguleti Sudhakara Reddy), ప్రిసీడియం కార్యదర్శులు కేశవ వినాయగం, సీనియర్లు పొన్‌ రాధాకృష్ణన్‌, డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హెచ్‌ రాజా, కేపీ రామలింగం, వీపీ దొరైస్వామి, చక్రవర్తి, ఎమ్మెల్యే నాయనార్‌ నాగేంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు

ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో

ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న

Read Latest Telangana News and National News

Updated Date - Dec 17 , 2024 | 11:29 AM