ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

J-K Assembly Elections: బీజేపీ 'హంగ్' ప్లాన్ తిప్పికొట్టేందుకే కాంగ్రెస్‌తో పొత్తు

ABN, Publish Date - Sep 22 , 2024 | 07:27 PM

భారతీయ జనతా పార్టీ ఉద్దేశాలపై ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ పాలన కొనసాగించేందుకు హంగ్ అసెంబ్లీనే బీజేపీనే కోరుకుంటోందని ఆరోపించారు. అయితే ప్రజలు అందుకు అంగీకరించరని చెప్పారు.

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల (Jammu and Kashmir Assembly Elections) తర్వాత హంగ్ అసెంబ్లీకి అవకాశం లేకుండా ఓటర్లకు స్పష్టమైన ప్రత్యామ్నాయాన్ని ఇవ్వాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీతో ముందస్తు పొత్తు కుదుర్చుకున్నట్టు నేషనల్ కాన్ఫరెన్స్ (NC) ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) తెలిపారు. ఎన్‌సీ అభ్యర్థికి మద్దతుగా దాల్ లేక్ వద్ద ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఒమర్ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు పొత్తులపై నేషనల్ కాన్ఫెరెన్స్ నిర్ణయం తీసుకోవడానికి కారణాన్ని తెలిపారు.


''మెషీన్లు నుంచి ఎలాంటి ఫలితం రాబోతోందో వారికి (బీజేపీ) తెలుసుండవచ్చు. కానీ, మిషన్లు ఏం చెబుతాయో మాకు తెలియదు. ప్రజల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ హంగ్ అసెంబ్లీకి మాత్రం అవకాశం లేదు'' అని ఒమర్ తెలిపారు. ఎన్నికల తర్వాత కూడా పొత్తులకు నేషనల్ కాన్ఫరెన్స్ వెళ్లి ఉండవచ్చని, అయితే ప్రభుత్వం ఏర్పడుతుందా? హంగ్ అసెంబ్లీ వస్తుందా? అనే అనుమానాలకు తావీయకుండా ప్రజలకు ఒక ఆప్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎన్నికలకు ముందే పొత్తులు కుదుర్చుకున్నామని చెప్పారు.

Jammu and Kashmir: పాక్‌తో చర్చల ప్రసక్తి లేదు: అమిత్‌షా


బీజేపీ ఆలోచన అదే..

భారతీయ జనతా పార్టీ ఉద్దేశాలపై ఒమర్ ఆందోళన వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలన కొనసాగించేందుకు హంగ్ అసెంబ్లీనే బీజేపీనే కోరుకుంటోందని ఆరోపించారు. అయితే ప్రజలు అందుకు (హంగ్ అసెంబ్లీకి) అంగీకరించరని అన్నారు. జమ్మూతో పోలిస్తే కశ్మీర్‌లో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు దూరంగా ఉంటున్నారని, కశ్మీర్‌లో బీజేపీకి వచ్చే సీట్లు కూడా ఏవీ ఉండవని తెలిపారు. ముస్లింల పట్ల బీజేపీ వైఖరి ఏమిటో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకపోవడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. దేశ జనాభాలో 16 శాతం ముస్లింలు ఉన్నారని, కేంద్రంలో ముంత్రిని చేసేందుకు ఒక్క ముస్లిం నేత కూడా వారికి కనిపించ లేదని విమర్శించారు. జమ్మూకశ్మీర్‌లో మూడు కుటుంబాల పాలన అంటూ బీజేపీ విమర్శించడాన్ని ఆయన తిప్పికొట్టారు. గత ఐదేళ్లలో జమ్మూకశ్మీర్‌లో బీజేపీ చేసిందేమీ లేదని, గర్వంగా చెప్పుకునేందుకు కూడా ఏమీ లేదని, ఆ కారణంగానే ప్రధానమంత్రి, హోం మంత్రి కశ్మీర్‌లోని మూడు కుటుంబాలనే టార్గెట్ చేసుకుంటున్నారని అన్నారు. జమ్మూకశ్మీర్‌కు ఏదైనా చేసి ఉంటే ఇలా మాట్లేడావారే కాదని చెప్పారు.


రాహుల్ రాకపై..

ఎన్నికల ప్రచారంలో భాగంగా కశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటించనుండటంపై ఒమర్ మాట్లాడుతూ, రాహుల్ వస్తే మంచిదేనని అన్నారు. బీజేపీ అగ్రనాయకత్వాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు తరచుగా ఇక్కడకు రావాలని రాహుల్‌ను తాను కోరుతున్నానని చెప్పారు. ప్రధాని మూడు సార్లు, హోం మంత్రి మూడు సార్లు, రక్షణ మంత్రి తరచు ఇక్కడకు వస్తు్న్నారని, ఇతర సీనియర్ నేతలు కూడా వస్తున్నారని, రాహుల్ గాంధీ కూడా ప్రచారానికి వస్తే కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో వారికి నైతిక స్థైర్యం మరింత పెరుగుతుందని అన్నారు.


Read More National News and Latest Telugu News

Narendra Modi: గర్భాశయ క్యాన్సర్‌ విషయంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన

Updated Date - Sep 22 , 2024 | 07:27 PM