ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: ఎయిర్‌షోలో సందర్శకుల మృతికి ఎవరు బాధ్యులు...

ABN, Publish Date - Dec 17 , 2024 | 11:11 AM

చెన్నై ఎయిర్‌ షోలో అపశృతి జరిగి సందర్శకులు మృతిచెందితే ఎవరిని బాధ్యులను చేశారని సినీ నటుడు, బీజేపీ నేత శరత్‌ కుమార్‌(Film actor and BJP leader Sarath Kumar) ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగరంలోని సంధ్య థియేటర్‌ వద్ద ‘పుష్ప-2’ చిత్రం ప్రీమియర్‌ ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోవడంతో ఈ ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్‌(Hero Allu Arjun)ను అరెస్టు చేయడంపై శరత్‌కుమార్‌ స్పందించారు.

- ప్రశ్నించిన నటుడు, బీజేపీ నేత శరత్‌ కుమార్‌

చెన్నై: చెన్నై ఎయిర్‌ షోలో అపశృతి జరిగి సందర్శకులు మృతిచెందితే ఎవరిని బాధ్యులను చేశారని సినీ నటుడు, బీజేపీ నేత శరత్‌ కుమార్‌(Film actor and BJP leader Sarath Kumar) ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగరంలోని సంధ్య థియేటర్‌ వద్ద ‘పుష్ప-2’ చిత్రం ప్రీమియర్‌ ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోవడంతో ఈ ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్‌(Hero Allu Arjun)ను అరెస్టు చేయడంపై శరత్‌కుమార్‌ స్పందించారు. ఎయిర్‌ షోలో అపశృతి జరిగి సందర్శకులు చనిపోతే ఎవరిని బాధ్యులు చేశారని ప్రశ్నించారు.

ఈ వార్తను కూడా చదవండి: Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షసూచన


సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్‌ వస్తారని ముందుగానే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చివుంటారని పేర్కొన్నారు. అయినప్పటికీ సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో కూడా హీరో అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేయడం భావ్యం కాదని, దీన్ని రాచకొండ సీపీ సుధీర్‌ బాబు పరిశీలించాలని కోరారు. అలాగే, హీరో మోహన్‌ బాబు నివాసంలోకి హద్దు మీరి కొందరు ప్రవేశించడం వల్లే ఆ దాడి ఘటన జరిగిందన్నారు. ఆయన మంచి నటుడని, కుటుంబ వివాదంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిందని శరత్‌ కుమార్‌ విమర్శించారు.


ఈవార్తను కూడా చదవండి: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు

ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో

ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న

Read Latest Telangana News and National News

Updated Date - Dec 17 , 2024 | 11:11 AM