Ayodhya: ముంచుకొస్తున్న గడువు.. రేపు కీలక సమావేశానికి బీజేపీ నిర్ణయం..
ABN, Publish Date - Jan 08 , 2024 | 03:44 PM
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది. జనవరి 10న
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది. జనవరి 10న ఈ మీటింగ్ జరగనున్నట్లు వెల్లడించింది. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోంది. తక్కువ సమయం మిగిలి ఉండటంతో ఏర్పాట్లు చకచకా నడుస్తున్నాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ.. గ్రాండ్ 'ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమం' ఏర్పాట్లను సమీక్షించేందుకు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, వినోద్ తావ్డే వంటి పలువురు అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ వేడుకకు ఇండియా నుంచే కాకుండా విదేశాల నుంచీ అనేక మంది వీవీఐపీలు హాజరుకానున్నారు. జనవరి 22 న జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొననున్నారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ్-ప్రతిష్ఠ (పవిత్ర) వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు ప్రధాన వేడుకకు ఒక వారం ముందు జనవరి 16న ప్రారంభమవుతాయి. పండితులు 1008 కలశాలతో మహాయజ్ఞం నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు. మహా సంప్రోక్షణ కోసం ఆలయ నగరిలో తాత్కాలిక గుడారాలు ఏర్పాటయ్యాయి.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 08 , 2024 | 03:44 PM