విదేశాలకు వెళ్లాలంటే బ్లాక్ మనీ ఎన్వోసీ తప్పనిసరి
ABN , Publish Date - Jul 25 , 2024 | 06:12 AM
విదేశాలకు వెళ్లాలనుకొనేవారికి అవసరమైన నిరభ్యంతర ధ్రువపత్రాల సంఖ్య పెరిగింది. ఈమేరకు కేంద్ర బడ్జెట్‌లో నిబంధనలను కఠినతరం చేస్తూ పేర్కొన్నారు. ఇకపై
ముంబయి, జూలై 24: విదేశాలకు వెళ్లాలనుకొనేవారికి అవసరమైన నిరభ్యంతర ధ్రువపత్రాల సంఖ్య పెరిగింది. ఈమేరకు కేంద్ర బడ్జెట్‌లో నిబంధనలను కఠినతరం చేస్తూ పేర్కొన్నారు. ఇకపై విదేశాలకు వెళ్లాలనుకొనేవారు నల్లధనం చట్టం కింద కూడా నిరభ్యంతర ధ్రువపత్రం సమర్పించాలి. అక్టోబరు 1 నుంచి ఇది అమలులోకి రానుంది. ప్రస్తుతం ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 230 ప్రకారం విదేశాలకు వెళ్లాలనుకొనేవారు ఎటువంటి పన్ను బకాయిలు లేరని లేదా పన్ను బకాయిలకు తగిన ఏర్పాట్లు చేశారని ఆదాయం పన్ను శాఖ అధికారుల నుంచి ధ్రువపత్రం తెచ్చుకోవాల్సి ఉంది. తాజాగా నల్లధనం చట్టం కింద కూడా నిరభ్యంతర ధ్రువపత్రం తీసుకోవాలని నిబంధన విధించారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పన్ను లెక్కల నిపుణులు భావిస్తున్నారు.