ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bengaluru: ప్రజ్వల్‌పై బ్లూకార్నర్‌ నోటీసు

ABN, Publish Date - May 08 , 2024 | 10:22 AM

జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌) బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. 196 దేశాలతో పాటు, ఇంటర్‌పోల్‌కు సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిపింది. ప్రజ్వల్‌ ఏ దేశంలోనైనా, విమానాశ్రయాలు, ఓడరేవుల్లో కనిపించినా సమాచారం ఇవ్వాలని ఇంటర్‌పోల్‌ను కోరామని పేర్కొంది.

బెంగళూరు, మే 7(ఆంధ్రజ్యోతి): జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌) బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. 196 దేశాలతో పాటు, ఇంటర్‌పోల్‌కు సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిపింది. ప్రజ్వల్‌ ఏ దేశంలోనైనా, విమానాశ్రయాలు, ఓడరేవుల్లో కనిపించినా సమాచారం ఇవ్వాలని ఇంటర్‌పోల్‌ను కోరామని పేర్కొంది. కాగా, ప్రజ్వల్‌ లైంగిక దౌర్జన్యం బాధితురాలి కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన జేడీఎస్‌ ఎమ్మెల్యే రేవణ్ణ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. మరోవైపు ప్రజ్వల్‌ లైంగిక దౌర్జన్యం వీడియోలను 2,500 పెన్‌డ్రైవ్‌లలో ఉంచి ఎన్నికల ముందు పంపిణీ చేశారని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.


మంగళవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆ పెన్‌డ్రైవ్‌లను పోలీసు అధికారులే పంపిణీ చేశారని, వారిని బెదిరించి అలా పంపిణీ చేయించారని విమర్శించారు. ఈ కుట్ర వెనుక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఉన్నారని ఆక్షేపించారు.

కాగా, ప్రజ్వల్‌ రాసలీలల వ్యవహారంపై మోదీ మంగళవారం తొలిసారిగా స్పందించారు. ప్రజ్వల్‌ లాంటి వ్యక్తులపై సానుభూతి ఉండదని, ఇలాంటి చర్యలకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇది శాంతిభద్రతల అంశం అయినందున రాష్ట్రప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

Updated Date - May 08 , 2024 | 10:22 AM

Advertising
Advertising