Kavitha: కవితకు మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించే ఛాన్స్?
ABN, Publish Date - Apr 09 , 2024 | 07:21 AM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi excise policy case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత(kavitha) జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కవితను కోర్టు ముందు అధికారులు హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో కవితకు మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi excise policy case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత(kavitha) జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కవితను కోర్టు ముందు అధికారులు హాజరుపరచనున్నారు. కవితను విచారించాలని ఇప్పటికే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ఎల్లుండి విచారణ రానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవితకు మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ నేత కవితకు మధ్యంతర బెయిల్‌ను ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్వు కోర్టు సోమవారం తిరస్కరించింది. ఢిల్లీలో మద్యం పాలసీ లైసెన్సుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలకు రూ.100 కోట్లు చెల్లించినట్లు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్(Hyderabad)లోని ఆమె నివాసంపై ఏజెన్సీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత మార్చి 15న సాయంత్రం కవితను ఈడీ అరెస్టు చేసింది. అనంతరం మార్చి 23 వరకు కవితకు ఈడీ కస్టడీ తర్వాత మరో మూడు రోజులు కవితకు ఈడీ(ED) కస్టడీని కోర్టు పోడగించింది. ఆ తర్వాత మార్చి 26న కవితకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఇది కూడా చదవండి
మోదీ ప్రసంగాల్లో ‘ఆర్‌ఎస్‌ఎస్ కంపు’
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 09 , 2024 | 07:29 AM