Budget : వరద నివారణ, నీటిపారుదలకు 11,500 కోట్లు
ABN, Publish Date - Jul 24 , 2024 | 05:49 AM
పలు రాష్ట్రాల్లో వరద నివారణ చర్యలు, నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో రూ.11,500 కోట్ల సహాయం ప్రకటించారు. వీటిలో కోసి-మేచి అనుసంధాన ప్రాజెక్టుతోపాటు మరో 20 నిర్మాణంలో ఉన్న బ్యారేజీలు..
National News : పలు రాష్ట్రాల్లో వరద నివారణ చర్యలు, నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో రూ.11,500 కోట్ల సహాయం ప్రకటించారు. వీటిలో కోసి-మేచి అనుసంధాన ప్రాజెక్టుతోపాటు మరో 20 నిర్మాణంలో ఉన్న బ్యారేజీలు, నదీ కాలుష్య నివారణ ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి.
ఏటా బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల కారణంగా వరదలతో సతమతమవుతోన్న అసోం రాష్ట్రానికి వరద నివారణ సంబంధితప్రాజెక్టులకు సహాయం అందుతుంది. అలాగే వరదలు, భారీ వర్షాలతో సతమతమయిన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాల్లో పునర్‌నిర్మాణ, పునరావాస కార్యక్రమాలకు సహాయం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.
Updated Date - Jul 24 , 2024 | 05:49 AM