ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RajyaSabha: రాజ్యసభలో ‘నమో నగర్’ కోసం ప్రైవేట్ బిల్లు

ABN, Publish Date - Aug 01 , 2024 | 11:49 AM

దేశంలోని ప్రతి రాష్ట్రంలో నమో నగర్ పేరిట హైటెక్ సిటీలు ఏర్పాటు చేయాలని బిహార్‌‌కు చెందిన బీజేపీ ఎంపీ భీమ్ సింగ్ గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. దీంతో నగరాలు పట్టణీకరణ జరగడం ద్వారా ఆర్థికాభివృద్ధితోపాటు మెరుగైన మౌలిక సదుపాయలు ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు.

Rajya Sabha MP Dr Bhim Singh

న్యూఢిల్లీ, ఆగస్ట్ 01: దేశంలోని ప్రతి రాష్ట్రంలో నమో నగర్ పేరిట హైటెక్ సిటీలు ఏర్పాటు చేయాలని బిహార్‌‌కు చెందిన బీజేపీ ఎంపీ భీమ్ సింగ్ గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. దీంతో నగరాలు పట్టణీకరణ జరగడం ద్వారా ఆర్థికాభివృద్ధితోపాటు మెరుగైన మౌలిక సదుపాయలు ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై శుక్రవారం రాజ్యసభలో చర్చించేందుకు ప్రైవేట్ బిల్లును ఆయన ప్రతిపాదించారు.

Also Read: Himachal Pradesh: భారీ వర్షాలు.. ఒకరు మృతి, 32 మంది గల్లంతు


ఇటీవల కొన్ని దశాబ్దాలుగా దేశంలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచే కాకుండా.. పట్టణాల నుంచి నగరాలకు వలసలు బారీగా పెరిగాయని పేర్కొన్నారు. పట్టాణాభివృద్ధిని బలోపేతం చేసేందుకు.. సుస్థిర అభివృద్ధి సాధించేందుకు దేశంలోని 100 నగరాలను స్మార్ట్ సిటీల పేరిట అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా ఎంపీ భీమ్ సింగ్ సభలో వివరించారు.

Also Read: ChandraBabu Govt: ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై వేటు!


అందులోభాగంగా 2015లో అటల్ మిషన్ ఫర్ రిజువెన్షన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) పథకాన్ని మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. పట్టణ ప్రాంతంలో మంచి నీటి సరఫరాతోపాటు మురుగు నీటి పారుదలను మెరుగు పరిచడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఎంపీ భీమ్ సింగ్ వివరించారు. అయితే పట్టణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇంతలా చర్యలు చేపడుతున్నా.. విమర్శుల సైతం తరచు వినిపిస్తున్నాయన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీ, దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహానగరాలు సైతం అందుకు మినహాయింపు కాదన్నారు.

Also Read: Wayanad Landslide: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక


ఇక ఛండీగఢ్‌ నగరంలోని పరిస్థితులను ఈ సందర్భంగా ఆయన సోదాహరణగా వివరించారు. ఆ పట్టణ నిర్మాణంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థ విషయంలో చోటు చేసుకున్న ఆధునీకరణను ఈ సందర్భంగా ఎంపీ భీమ్ సింగ్ సోదాహరణగా వివరించారు. ఈ తరహా నగర నిర్మాణం వల్ల రద్దీ తగ్గడమే కాకుండా.. ఆయా నగరాలల్లోని ప్రజలు జీవన ప్రమాణాలు సైతం మెరుగవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఈ తరహా నగరాలు తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆ క్రమంలో "నమో నగర్" పేరుతో హైటెక్ సిటీలను ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఎంపీ భీమ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని పలువురు నమోగా కీర్తిస్తారు. నరేంద్ర మోదీలోని తొలి రెండు అక్షరాలను కలిపి నమోగా పేర్కొంటారన్న సంగతి అందరికి తెలిసిందే.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 01 , 2024 | 11:50 AM

Advertising
Advertising
<