ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajyasabha: ఆ సీటు వద్ద భారీగా నగదు.. కాంగ్రెస్ సభ్యుడిపై విచారణకు ఆదేశం.. ఖర్గే అభ్యంతరం..

ABN, Publish Date - Dec 06 , 2024 | 11:52 AM

సభలో ఓ సీటు వద్ద లభ్యమైన నగదు ఎవరిదో తెలుసుకునేందుకు విచారణ చేపట్టినప్పుడు, అభిషేక్ మను సింఘ్వీ పేరును ప్రస్తావించడం సమంజసమా అంటూ ఖర్గే ప్రస్తావించారు. ఈ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బీజేపీ నుంచి జేపీ నడ్డా, పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు స్పందిస్తూ..

Rajya Sabha

రాజ్యసభలో ఓ సభ్యుడి సీటు వద్ద రూ.500 నోట్ల కట్ట లభ్యం కావడంపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ విచారణకు ఆదేశించడం తీవ్ర కలకలం రేపింది. విచారణకు ఆదేశిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటన సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సంఘ్వీ పేరును ప్రస్తావించడంపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఓ సీటు వద్ద లభ్యమైన నగదు ఎవరిదో తెలుసుకునేందుకు విచారణ చేపట్టినప్పుడు, అభిషేక్ మను సింఘ్వీ పేరును ప్రస్తావించడం సమంజసమా అంటూ ఖర్గే ప్రస్తావించారు. ఈ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బీజేపీ నుంచి జేపీ నడ్డా, పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు స్పందిస్తూ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని, దీనిపై కాంగ్రెస్ సభ్యులు ఎందుకు ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు. దీని వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోందని కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ ఛైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. చివరకు ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఛైర్మన్ జగదీప్ ధన్కర్ చెబుతూ జీరో అవర్‌ను ప్రారంభించారు.


అసలు ఏం జరిగింది..

గురువారం రాజ్యసభ వాయిదా పడిన తర్వాత సాధారణ తనిఖీల సందర్భంగా 222వ నెంబర్ సీటు వద్ద భద్రతా అధికారులు కరెన్సీ నోట్లను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారని, ఈ విషయం తన దృష్టికి రావడంతో నగదు ఎలా సభలోకి వచ్చింది, ఎవరిదో తేల్చేందుకు విచారణకు ఆదేశించినట్లు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ తెలిపారు. 222వ నెంబర్ సీటు తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీదిగా ఛైర్మన్ తన ప్రకటనలో పేర్కొనడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పత్రిపక్షాలపై బీజేపీ కుట్రగా కాంగ్రెస్ ఈ చర్యను పేర్కొంది.


సింఘ్వీ స్పందన

రాజ్యసభలో అభిషేక్ మను సంఘ్వీ సీటు వద్ద నగదు లభించడంపై ఆయన ఎక్స్‌లో స్పందించారు. తాను మొదటిసారి వింటున్నానని, ఇలాంటి ఘటన గురించి తాను ఎప్పుడూ వినలేదన్నారు. తాను ఎప్పుడు రాజ్యసభకు వెళ్లినా జేబులో రూ. 500 నోటు ఒక్కటే పెట్టుకుంటానని, తాను గురువారం మధ్యాహ్నం 12.57 గంటలకు రాజ్యసభకు చేరుకున్నానని, మధ్యాహ్నం 1.00 గంటకు సభ వాయిదా పడిందని తెలిపారు. తాను అప్పటినుంచి 1.30 గంటల వరకు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో క్యాంటీన్‌లో కూర్చున్నానని, ఆ తర్వాత అక్కడి నుంచ వెళ్లిపోయినట్లు అభిషేక్ మను సింఘ్వీ తన ట్వీట్‌లో తెలిపారు. 222 నెంబర్ సీటు వద్దకు నగదు ఎలా వచ్చింది, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అక్కడ పెట్టారా అనే విషయాలు విచారణలో తేలే అవకాశం ఉంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 06 , 2024 | 12:06 PM