ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

West Bengal: కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు, ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు

ABN, Publish Date - May 22 , 2024 | 06:42 PM

పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి కోల్‌కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ బుధవారంనాడు సంచలన తీర్పు ప్రకటించింది. 1993లో చేసిన చట్టానికి విరుద్ధంగా పత్రాలు జారీ చేశారని న్యాయమూర్తులు తపబ్రత చక్రవర్తి, రాజశేఖర్ మంతాతో కూడిన హైకోర్టు ధర్మాసనం తమ తీర్పులో స్పష్టం చేసింది.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రభుత్వానికి కోల్‌కతా హైకోర్టు (Calcutta High Court) షాక్ ఇచ్చింది. 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ (OBC) సర్టిఫికెట్లను రద్దు చేస్తూ బుధవారంనాడు సంచలన తీర్పు ప్రకటించింది. 1993లో చేసిన చట్టానికి విరుద్ధంగా పత్రాలు జారీ చేశారని న్యాయమూర్తులు తపబ్రత చక్రవర్తి, రాజశేఖర్ మంతాతో కూడిన హైకోర్టు ధర్మాసనం తమ తీర్పులో స్పష్టం చేసింది. అయితే, తమ ఉత్తర్వుల ప్రభావం ఇప్పటికే ఉద్యోగాలు, పథకాల లబ్ధి పొందిన వారిపై ఎటువంటి ప్రభావం చూపవని తెలిపింది. 2010కి ముందు 66 తరగతులుగా క్లాసిఫై చేసిన ఓబీసీల జోలికి తాము వెళ్లడం లేదని, పిటిషన్‌లో వాటిని సవాలు చేయలేదని ధర్మాసనం పేర్కొంది.

Election Commission: గాడితప్పుతున్న ప్రసంగాలపై ఈసీ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులకు నోటీసులు


హైకోర్టు నిర్ణయాన్ని ఆమోదించం: మమత

కాగా, 2010 తర్వాత అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ తీర్పు తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు. ''హైకోర్టు ఆదేశం అందింది. కానీ మేము దీనిని అంగీకరించం. బీజేపీ వల్ల 26,000 మంది తమ ఉద్యోగాలు కోల్పోతారు. బీజేపీ ఆర్డర్‌ను మేము అంగీకరించే ప్రసక్తి లేదు. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయి'' అని మమతా బెనర్జీ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2024 | 06:42 PM

Advertising
Advertising