Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?
ABN, Publish Date - May 12 , 2024 | 09:31 AM
లోక్‌సభ ఎన్నికల(lok sabha elections 2024) నాలుగో దశ పోలింగ్ రేపు (మే 13న) జరగనుంది. ఈ క్రమంలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజున ఓటు వేసేందుకు వెళ్లే క్రమంలో మొబైల్(smart phone), కెమెరా(camera) వంటివి తీసుకెళ్లవచ్చా, మర్చిపోయి తీసుకెళ్తే ఎలా అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
లోక్‌సభ ఎన్నికల(lok sabha elections 2024) నాలుగో దశ పోలింగ్ రేపు (మే 13న) జరగనుంది. ఈ క్రమంలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే రోజు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలింగ్ రోజున ఓటు వేసేందుకు అనేక ప్రాంతాల నుంచి ఓటర్లు స్వగ్రామాలకు తరలివెళ్లారు. అయితే పోలింగ్ రోజున ఓటు వేసేందుకు వెళ్లే క్రమంలో మొబైల్(smart phone), కెమెరా(camera) వంటివి తీసుకెళ్లవచ్చా, మర్చిపోయి తీసుకెళ్తే ఎలా అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
లోక్‌సభ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసేందుకు వెళ్లినప్పుడు మొబైల్, కెమెరా, ఇయర్‌ఫోన్‌లు వంటి పరికరాలను ఇంట్లోనే ఉంచాలి. పోలింగ్ కేంద్రం(polling centre) లోపలికి వీటిని తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. ఎవరైనా పొరపాటున తన మొబైల్ ఫోన్‌తో పోలింగ్ బూత్‌కు చేరుకున్నప్పటికీ, అతను దానిని స్విచ్ ఆఫ్ చేసి ఆ ప్రాంతంలోని భద్రతా సిబ్బంది లేదా పోలింగ్ సిబ్బంది లేదా బీఎల్‌ఓ వద్ద ఇవ్వాల్సి ఉంటుంది. ఓటింగ్ సమయంలో మీ ప్రాంతంలోని BLOలు పోలింగ్ బూత్ దగ్గర క్యాంపింగ్‌లో ఉంటారు. దీంతో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా స్లిప్పులతో ఒకే చోట కూర్చుంటారు. మీరు కావాలంటే వారి వద్ద కూడా ఫోన్ ఆ సమయంలో డిపాజిట్ చేయవచ్చు.
ఎన్నికల సంఘం(election commission of india) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ బూత్(polling booth)లోకి ఓటరు మొబైల్ ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు. మీ వద్ద మొబైల్ ఫోన్ ఉంటే సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకుంటారు. ఓటరు హెల్ప్‌లైన్ యాప్ లేదా voters.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా ఓటరు హెల్ప్‌లైన్ నంబర్ 1950కి కాల్ చేయడం ద్వారా మీ పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి:
Delhi: కేంద్రంలో ‘ఇండియా’ సర్కారు: కేజ్రీవాల్
Varanasi : గంగా హారతిలో పాల్గొన్న అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్
Read Latest National News and Telugu News
Updated Date - May 12 , 2024 | 10:43 AM