ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cancellation of trains: 10వరకు చెన్నై సెంట్రల్‌-తిరుపతి రైళ్ల రద్దు.. 11నుంచి తిరుపతికి బదులుగా తిరుచానూరు నుంచి

ABN, Publish Date - Mar 07 , 2024 | 12:53 PM

తిరుపతి సెక్షన్‌లో చేపడుతున్న మరమ్మతుల కారణంగా తిరుపతికి వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్‏లు రద్దు చేయగా, మరికొన్ని పాక్షికంగా, మరికొన్నింటిని ఇతర మార్గాల్లో నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే పేర్కొంది.

చెన్నై: తిరుపతి సెక్షన్‌లో చేపడుతున్న మరమ్మతుల కారణంగా తిరుపతికి వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్‏లు రద్దు చేయగా, మరికొన్ని పాక్షికంగా, మరికొన్నింటిని ఇతర మార్గాల్లో నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే పేర్కొంది. - నెం.06728 తిరుపతి - మూర్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌, నెం.06727 మూర్‌ మార్కెట్‌ - తిరుపతి మెమో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈనెల 10వ తేది వరకు రద్దు. - నెం.16854 విల్లుపురం - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌(Villupuram - Tirupati Express), నెం.16853 తిరుపతి - విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈనెల 14వ తేది వరకు రద్దు. - నెం.06753 అరక్కోణం - తిరుపతి మెమో, నెం.06754 తిరుపతి - అరక్కోణం మెమో రైళ్లు ఈ నెల 10వ తేది వరకు రద్దు. - నెం.17407 తిరుపతి - మన్నార్‌గుడి పమని ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 10, 12, 14 తేదీలు, నెం.17408 మన్నార్‌గుడి - తిరుపతి పమని ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 11, 13, 15 తేదీల్లో రద్దు. - నెం.16112 పుదుచ్చేరి - తిరుపతి మెమో ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 12 నుంచి 23 వరకు, నెం.16111 తిరుపతి - పుదుచ్చేరి మెమో ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 11 నుంచి 24వ తేది వరకు రద్దు.

తిరుపతికి బదులుగా తిరుచానూరు...

- నెం.06753 అరక్కోణం - తిరుపతి మెమో, నెం.06727 మూర్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ - తిరుపతి మెమో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈనెల 11 నుంచి 14వ తేది వరకు తిరుపతికి బదులుగా తిరుచానూరు వరకు మాత్రమే నడుస్తాయి. అలాగే, నెం.06754 తిరుపతి - అరక్కోణం మెమో ఎక్స్‌ప్రెస్‌, 06728 తిరుపతి - మూర్‌మార్కెట్‌ కాంప్లెక్స్‌ మెమో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు తిరుపతికి బదులుగా తిరుచానూరు నుంచి బయల్దేరుతాయి.

రేణిగుంట వరకే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌...

- నెం.16057 చెన్నై సెంట్రల్‌ - తిరుపతి, నెం.16053 చెన్నై సెంట్రల్‌- తిరుపతి మధ్య నడిచే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈనెల 11 నుంచి 23వ తేది వరకు తిరుపతికి బదులుగా రేణిగుంట వరకు మాత్రమే నడుస్తాయి. అలాగే, నెం.16058 తిరుపతి- చెన్నై సెంట్రల్‌, నెం.16054 తిరుపతి - చెన్నై సెంట్రల్‌ సప్తగిరి రైళ్లు తిరుపతికి బదులుగా రేణిగుంట నుంచి బయల్దేరుతాయి.

Updated Date - Mar 07 , 2024 | 12:53 PM

Advertising
Advertising