ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Supreme Court: బెంగాల్‌ టీచర్ల భర్తీ స్కాంపై సీబీఐ విచారణ నిలుపుదల

ABN, Publish Date - Apr 30 , 2024 | 05:10 AM

పాధ్యాయుల భర్తీ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ స్కాంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ కలకత్తా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.

25 వేల ఉద్యోగాల రద్దుపై మాత్రం స్టేకు నిరాకరణ 8 సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29: ఉపాధ్యాయుల భర్తీ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ స్కాంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ కలకత్తా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. స్కూల్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా నియమితులైన 25,753 టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బందిని తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మాత్రం స్టే విధించడానికి నిరాకరించింది. తదుపరి విచారణను మే 6న చేపట్టనున్నట్టు తెలిపింది.


25వేలమంది ఉద్యోగుల నియామకాలను రద్దు చేయడం తీవ్రమైన విషయమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉద్యోగాలు పొందిన వారిలో అర్హులు ఎవరు? అనర్హులు ఎవరు? అన్నదాన్ని విడదీసి చూడలేమా? అక్రమాల ద్వారా లబ్ధిపొందిన వారెవరో గుర్తించలేమా? అని ప్రశ్నించింది. కుంభకోణంలో భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులను గుర్తించేందుకు దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. నియామకాలను కూడా రద్దు చేసింది. దీనిని సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Updated Date - Apr 30 , 2024 | 05:10 AM

Advertising
Advertising