CBSE: 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలు విడుదల.. ఎప్పటి నుంచంటే..

ABN, Publish Date - Nov 21 , 2024 | 07:25 AM

10, 12వ తరగతి CBSE పరీక్షల షెడ్యూల్‌ 2025ను బోర్డు విడుదల చేసింది. ఈ రెండు తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయి, ఏ సమయంలో ఉంటాయనే వివరాలను ఇక్కడ చుద్దాం.

CBSE: 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలు విడుదల.. ఎప్పటి నుంచంటే..
CBSE 10th 12th class Board Exam

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతులకు సంబంధించి 2025 సంవత్సరానికి పరీక్ష తేదీలను ప్రకటించింది. ఇంతకుముందు CBSE బోర్డు చెప్పినట్లుగా విడుదల చేసిన తేదీషీట్ ప్రకారం CBSE బోర్డు 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమవుతాయి. మొదటి పేపర్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌గా ఉంటుంది. ఇది కాకుండా 10వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15, 2025న ఇంగ్లీష్ పేపర్‌తో మొదలవుతాయి. గత కొన్నేళ్ల సంప్రదాయానికి స్వస్తి చెప్పి ఈసారి ప్రధాన సబ్జెక్టులకు ముందుగా పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి.


CBSE బోర్డ్ క్లాస్ 12వ తరగతి ఎగ్జామ్స్ షెడ్యూల్ 2025

  • ఫిబ్రవరి 15, 2025న ఫిజికల్ ఎడ్యుకేషన్

  • ఫిబ్రవరి 21, 2025న భౌతికశాస్త్రం

  • ఫిబ్రవరి 22, 2025న బిజినెస్ స్టడీస్

  • ఫిబ్రవరి 24, 2025న భౌగోళిక శాస్త్రం

  • ఫిబ్రవరి 27, 2025న రసాయన శాస్త్రం

  • మార్చి 8, 2025న గణితం - స్టాండర్డ్/అప్లైడ్ మ్యాథమెటిక్స్

  • మార్చి 11, 2025న ఇంగ్లీష్ ఎలక్టివ్/ఇంగ్లీష్ కోర్

  • మార్చి 19, 2025న ఎకనామిక్స్

  • మార్చి 22, 2025న పొలిటికల్ సైన్స్

  • మార్చి 25, 2025న జీవశాస్త్రం

  • మార్చి 26, 2025న అకౌంటింగ్

  • ఏప్రిల్ 1, 2025న చరిత్ర

  • ఏప్రిల్ 4, 2025న సైకాలజీ


CBSE బోర్డ్ క్లాస్ 10వ తరగతి పరీక్షల తేదీల షెడ్యూల్ 2025

  • ఫిబ్రవరి 15, 2025న ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ / ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్

  • ఫిబ్రవరి 20, 2025న సైన్స్

  • ఫిబ్రవరి 22, 2025న ఫ్రెంచ్ / సంస్కృతం

  • ఫిబ్రవరి 25, 2025న సామాజిక శాస్త్రం

  • ఫిబ్రవరి 28, 2025న హిందీ కోర్సు 'A'/'B'

  • మార్చి 10, 2025న గణితం

  • మార్చి 18, 2025న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ


86 రోజుల ముందే

డేట్‌షీట్‌ను విడుదల చేస్తున్నప్పుడు, ఒక విద్యార్థికి సంబంధించిన రెండు సబ్జెక్టుల పరీక్షలు ఒకే తేదీన జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. ఉదయం 10.30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల ప్రారంభానికి 86 రోజుల ముందు తొలిసారిగా డేట్ షీట్‌ను విడుదల చేశారు. పాఠశాలలు సకాలంలో LOCని సమర్పించడం వల్ల ఇది సాధ్యమైందని అధికారులు అన్నారు.

సన్నద్ధం కావాలి

CBSE బోర్డు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు cbse.gov.inని ఈ లింక్ నుంచి డేట్‌షీట్ PDF వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో విద్యార్థులు పూర్తిగా తమ పరీక్షల కోసం సన్నద్ధం కావాలని అధికారులు సూచించారు. మరిన్ని తాజా అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inని సందర్శించవచ్చని అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి:


PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..

Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 21 , 2024 | 07:30 AM