ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CEC: ఇది మంచి పద్ధతి కాదు.. జైరామ్ రమేష్‌కు సీఈసీ అక్షింతలు

ABN, Publish Date - Jun 03 , 2024 | 03:28 PM

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దేశవ్యాప్తంగా 150 మంది జిల్లా మెజిస్ట్రేట్‌లకు ఫోన్ చేసి వారిని ప్రభావితం చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఘాటుగా స్పందించారు. వదంతులు వ్యాప్తి చేయడం, ప్రతి ఒక్కరిని అనుమానించడం సరికాదని అన్నారు.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రక్రియ పూర్తి కాగానే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) దేశవ్యాప్తంగా 150 మంది జిల్లా మెజిస్ట్రేట్‌లకు ఫోన్ చేసి వారిని ప్రభావితం చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) చేసిన వ్యాఖ్యలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ (Rajiv Kumar) ఘాటుగా స్పందించారు. వదంతులు వ్యాప్తి చేయడం, ప్రతి ఒక్కరిని అనుమానించడం సరికాదని అన్నారు.

Lok Sabha Exit Polls 2024: 'ఎగ్జిట్ పోల్' ఫలితాలపై సోనియాగాంధీ ఫస్ట్ రియాక్షన్


"ఎవరైనా ఒకరు అందర్నీ (జిల్లా మెజిస్ట్రేట్లు/రిటర్నింగ్ అధికారులు) ప్రభావితం చేయగలుగుతారా? ఇదెవరు చేశారో మాకు చెప్పండి. ఆ పని చేసిన వ్యక్తిని మేము శిక్షిస్తాం. వదంతులు సృష్టించడం, ప్రతి ఒక్కరిని అనుమానించడం ఎంతమాత్రం మంచిది కాదు'' అని రాజీవ్ కుమార్ సోమవారంనాడు ఏర్పటు చేసిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. మంగళవారంనాడు జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు ముందు సీఈసీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా పార్టీల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నామని సీఈసీ చెప్పారు. వాటన్నింటినీ పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. కంట్రోల్ యూనిట్స్ కదలికలను సీసీటీవీ కెమెరా ద్వారా మానిటరింగ్ చేయాలని కోరారని, ఆ పని తాము చేస్తామని వివరించారు.

For Latest News and National News click here

Updated Date - Jun 03 , 2024 | 03:33 PM

Advertising
Advertising