ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Central Govt: రాష్ట్రాలకు చెల్లించాల్సిన పన్నుల వాటా విడుదల.. తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే

ABN, Publish Date - Oct 10 , 2024 | 03:03 PM

కేంద్ర పనుల్లో రాష్ట్రాలకు చెల్లించాల్సిన వాటాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపు రూ.11 వేల కోట్లు విడుదల చేసింది.

అమరావతి: కేంద్ర పనుల్లో రాష్ట్రాలకు చెల్లించాల్సిన వాటాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపు రూ.11 వేల కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 7,211 కోట్లు, తెలంగాణకు రూ. 3,745 కోట్లు విడుదలయ్యాయి. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1,78,173 కోట్లు రిలీజ్ చేశారు. అక్టోబరు, 2024లో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.


ముందస్తు వాటాగా రూ. 89,086.50 కోట్లతో కలిపి మొత్తం రూ. 1,78,173 కోట్లు రిలీజ్ చేసింది. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమ వ్యయాలకు ఆర్థిక సాయం అందించడానికి నిధులు విడుదల చేసినట్లు తెలిపింది.

Updated Date - Oct 10 , 2024 | 03:33 PM