ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Central Government : అగ్నిపథ్‌ సమీక్షకు కమిటీ..17న కేంద్రానికి నివేదిక

ABN, Publish Date - Jun 15 , 2024 | 05:28 AM

మిత్రపక్షాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో అగ్నిపథ్‌లోని లోపాలను సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ పథకాన్ని సమీక్షించడానికి, అగ్నివీర్‌లకు మరింత లాభం చేకూర్చే అంశాలపై చర్చించేందుకు పది మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ బృందం ఈ స్కీమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి అవసరమైన సిఫారసులు చేయనుంది.

న్యూఢిల్లీ, జూన్‌ 14: మిత్రపక్షాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో అగ్నిపథ్‌లోని లోపాలను సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ పథకాన్ని సమీక్షించడానికి, అగ్నివీర్‌లకు మరింత లాభం చేకూర్చే అంశాలపై చర్చించేందుకు పది మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ బృందం ఈ స్కీమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి అవసరమైన సిఫారసులు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో జరిగే జీ7 సదస్సు నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ నెల 17, 18వ తేదీల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే భారత సైన్యం కూడా ఈ పథకంపై ఒక అంతర్గత నివేదికను కేంద్రానికి సమర్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సిఫారసులతోపాటు మిత్రపక్షాల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రధాని కార్యాలయం తుది నిర్ణయం తీసుకునే అవకాశ ఉంది. అగ్నిపథ్‌ పథకం సమీక్ష అంశం కూడా మోదీ ప్రభుత్వ మొదటి 100 రోజుల ఎజెండాలో ఉంది.

Updated Date - Jun 15 , 2024 | 07:22 AM

Advertising
Advertising