ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నవంబరు 26న పార్లమెంటు ప్రత్యేక భేటీ

ABN, Publish Date - Oct 27 , 2024 | 03:59 AM

కేంద్ర ప్రభుత్వం నవంబరు 26న పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

న్యూఢిల్లీ, అక్టోబరు 26: కేంద్ర ప్రభుత్వం నవంబరు 26న పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబరు 26 నాటికి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌సభ ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. నవంబరు 26న పార్లమెంటులోని సంవిధాన్‌ సదాన్‌లో ఉభయ సభల సంయుక్త సమావేశం జరగనుందని అధికారులు తెలిపారు. 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించగా 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. కాగా, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125వ పుట్టిన రోజు 2015 ఏప్రిల్‌ 14 సందర్భంగా నవంబరు 26ను జాతీయ న్యాయదినోత్సవంగా కేంద్రం ప్రకటించింది.

Updated Date - Oct 27 , 2024 | 03:59 AM