ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SSY: రెండు సుకన్య సమృద్ధి ఖాతాలున్నాయా.. జాగ్రత్త పడండి.. లేకుంటే అంతే..

ABN, Publish Date - Sep 18 , 2024 | 12:20 PM

ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు కంటే ఎక్కువ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచినట్లయితే.. ఉపయోగించని ఖాతాలను వెంటనే మూసివేయాల్సి ఉంటుందని ఆర్థిక వ్యవహారాల విభాగం తెలిపింది. ఒకవేళ అలా చేయకపోతే సుకన్య యోజన స్కీమ్-2019 మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్న ఖాతాలను గుర్తించి.. సరైన మార్గదర్శకాలు పాటించని వాటిని మూసివేస్తామని సర్క్యూలర్ జారీ చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: చిన్న మొత్తాల పొదుపు పథకాల రెగ్యులరైజేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సరైన మార్గదర్శకాలు పాటించకుండా ఓపెన్ చేసిన చిన్న మొత్తాల పొదుపు పథకాల ఖాతాలను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది. దీనికి సంబంధించి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒకే కుంటుంబంలో రెండు కంటే ఎక్కువ సుకన్య సమృద్ధి ఖాతాలు ఉంటే వాటిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని తెలిపింది. లేదంటే ఖాతాలు క్లోజ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.


అలాంటి ఖాతాలు మూసివేయండి..

ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు కంటే ఎక్కువ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచినట్లయితే.. ఉపయోగించని ఖాతాలను వెంటనే మూసివేయాల్సి ఉంటుందని ఆర్థిక వ్యవహారాల విభాగం తెలిపింది. ఒకవేళ అలా చేయకపోతే సుకన్య యోజన స్కీమ్-2019 మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్న ఖాతాలను గుర్తించి.. సరైన మార్గదర్శకాలు పాటించని వాటిని మూసివేస్తామని సర్క్యూలర్ జారీ చేసింది. చట్టపరంగా ఆడపిల్లల సంరక్షకులు కానీ వారు గ్రాండ్ పేరెంట్స్ ఆధ్వర్యంలో సుకన్య సమృద్ధి ఖాతా ఇప్పటికే తెరిచి ఉంటే.. అలాంటి ఖాతాలను వెంటనే చట్టప్రకారం సహజ సంరక్షకులకు బదిలీ చేయాలి. అంటే జీవించి ఉన్న తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులకు వాటిని ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆగస్టు 21, 2024న తెలిపింది.


పాన్ కార్డు, ఆధార్ కార్డు అప్డేట్ చేయండి...

సుకన్య సమృద్ధి యోజన పథకం తెరిచిన సమయంలో పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవ్వకపోతే తాజాగా మార్గదర్శకాల ప్రకారం వెంటనే వాటిని సమర్పించాలి. రెండూ అంతకు మించి ఉన్న ఖాతాలను రెగ్యులరైజ్ చేయడానికి ముందే వీటిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. పాన్, ఆధార్ కార్డులు లేని ఖాతాలను గుర్తించాలని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పోస్టాఫీసులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు చిన్న మొత్తాల పొదుపు ఖాతాలను క్రమబద్ధీకరించే అధికారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఉందని పోస్టల్ శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. సక్రమంగా లేని ఖాతాల క్రమబద్ధీకరించేందుకు ముందుగా కాన్కరెన్స్ బడ్జెట్ డివిజన్ డీఈఏ ఆమోదం పొందాల్సి ఉంటుందని తెలిపింది. ఆ తర్వాతనే వివిధ జాతీయ చిన్న మొత్తాల పొదుపు పథకాల కింద తెరిచిన సరిగా లేని ఖాతాల క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుందని వెల్లడించింది.

Updated Date - Sep 18 , 2024 | 12:20 PM

Advertising
Advertising