ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Central Govt : పారిస్‌ వెళ్లేందుకు మాన్‌కు అనుమతివ్వలేం

ABN, Publish Date - Aug 04 , 2024 | 05:45 AM

భారత హాకీ జట్టుకు మద్దతు తెలిపేందుకు పారిస్‌ ఒలింపిక్స్‌ వెళ్లాలని నిర్ణయించుకున్న పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌కు కేంద్రం అనుమతి నిరాకరించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హకీ జట్టు ఆగస్టు 4న

  • భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం నిర్ణయం

చండీగఢ్‌, ఆగస్టు 3: భారత హాకీ జట్టుకు మద్దతు తెలిపేందుకు పారిస్‌ ఒలింపిక్స్‌ వెళ్లాలని నిర్ణయించుకున్న పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌కు కేంద్రం అనుమతి నిరాకరించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హకీ జట్టు ఆగస్టు 4న క్వార్టర్‌ఫైనల్‌ ఆడనుంది. భారత టీంను ప్రోత్సహించేందుకు ఆగస్టు 4-9 వరకు పారిస్‌ వెళ్లాలని భగవంత్‌ మాన్‌ షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు.

ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖకు సమాచారం ఇచ్చారు. దౌత్య పాస్‌పోర్టు ఉన్నప్పటికీ జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాన్‌కు పొలిటికల్‌ క్లియరెన్స్‌ ఇవ్వడం కుదరదని కేంద్రం చెప్పినట్లు సమాచారం. ఇంత తక్కువ సమయంలో ఆయనకు పారి్‌సలో ఆ స్థాయి ఏర్పాట్లు చేయలేమని దీంతో పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘భారత హాకీ జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లు పంజాబీలే. పారిస్‌ వెళ్లేందుకు మాన్‌కు అనుమతివ్వకపోవడం అంటే 3 కోట్ల పంజాబ్‌ ప్రజల మనోభావాలను కేంద్రం అవమానించడమే’’ అని ఆప్‌ పేర్కొంది. ఆగస్టు 4-7 వరకు అమెరికాలో జరిగే శాసనసభ స్పీకర్ల భేటీలో పాల్గొనేందుకు పంజాబ్‌ స్పీకర్‌ కుల్టర్‌కు కూడా కేంద్రం అనుమతి ఇవ్వలేదు.

Updated Date - Aug 04 , 2024 | 05:45 AM

Advertising
Advertising
<