మళ్లీ ‘భారత్’ బ్రాండ్ అమ్మకాలు
ABN, Publish Date - Nov 06 , 2024 | 04:56 AM
భారత్ బ్రాండ్ కింద రెండో దశ సరుకుల విక్రయాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది.
గోధుమ పిండి కేజీ రూ.30, బియ్యం కేజీ రూ.34
న్యూఢిల్లీ, నవంబరు 5: భారత్ బ్రాండ్ కింద రెండో దశ సరుకుల విక్రయాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. ఇందులో భాగంగా నాఫెడ్, ఎన్‌సీసీఎప్, కేంద్రీయ భండార్, ఈ కామర్స్ సంస్థల ద్వారా గోధుమ పిండిని, బియ్యాన్ని సబ్సిడీ ధరలకు ప్రజలకు అందిస్తారు. కేజీ గోధుమ పిండి రూ.30లు, కేజీ బియ్యం రూ.34ల చొప్పున 5 కేజీలు, 10 కేజీల ప్యాకెట్ల రూపంలో వాటిని విక్రయిస్తారు. రెండో దశ విక్రయాల కోసం 3,69,000 టన్నుల గోధుమలను, 2,91,000 టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించిందని, అవసరమైతే సరుకులను మళ్లీ సేకరిస్తామని కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. కాగా, రెండో దశలో భారత్ బ్రాండ్ సరుకుల ధరలు స్వల్పంగా పెరిగాయి. మొదటి దశలో గోధమ పిండిని రూ.27.5లకు, బియ్యాన్ని రూ.29లకు విక్రయించారు.
Updated Date - Nov 06 , 2024 | 04:56 AM