ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: తమిళనాడులో 56 శాతం పెరిగిన బాల్యవివాహాలు..

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:05 PM

ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. మూఢ నమ్మకాలకు, దురాశకు పోయి బాలికల బాల్యాన్ని ఛిద్రం చేసేస్తున్నారు. ఎదుటి వ్యక్తుల నుంచి వస్తున్న ‘ఆశా’జనక మాటలు, తమ భారం తగ్గించుకుందామనే ఆలోచనతో చిన్నిపిల్లల్ని పెళ్లిపీటలెక్కిస్తున్నారు.

- ఈరోడ్‌, తిరునల్వేలిలో అధికం

చెన్నై: ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. మూఢ నమ్మకాలకు, దురాశకు పోయి బాలికల బాల్యాన్ని ఛిద్రం చేసేస్తున్నారు. ఎదుటి వ్యక్తుల నుంచి వస్తున్న ‘ఆశా’జనక మాటలు, తమ భారం తగ్గించుకుందామనే ఆలోచనతో చిన్నిపిల్లల్ని పెళ్లిపీటలెక్కిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఏకంగా 55.6 శాతం బాల్య వివాహాలు(Child marriages) పెరగడమే ఇందుకు తార్కాణం. 2023లో 1,054 బాల్యవివాహాలు జరగ్గా, ఆ సంఖ్య ఈ ఏడాది నవంబరు నాటికి 1640కు పెరగడం పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది.

ఈ వార్తను కూడా చదవండి: Elephant: తెలివి మనుషులకే కాదు.. మాక్కూడా ఉందిగా..


ఫిర్యాదుల్లో జాప్యం...

బాల్యవివాహాలపై ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకొని వాటిని అడ్డుకోవడం సహజం. అయితే గత రెండేళ్లలో తగ్గినట్లు తెలిసింది. 2022లో 3,609 ఫిర్యాదులు అందగా, 70.2 శాతం వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఫిర్యాదులు రావడం ఆలస్యమవుతుండడంతో పూర్తిస్థాయిలో వీటిని అడ్డుకొనేందుకు అవకాశాలు లేకుండాపోయాయని సమాచారం. ఈరోడ్‌లో ఈ ఏడాది అధికంగా 150, తిరునల్వేలి జిల్లాలో 133 వివాహాలు జరిగాయి.


అదే గత ఏడాది ఈ రెండు జిల్లాల్లో వరుసగా 62-40 చొప్పున వరుసగా బాల్యవివాహాలు నమోదు కాగా, ఈ ఏడాది రెండింతలు అధికమయ్యాయి. బాల్యవివాహాలు అధికంగా జరిగిన తొలి 10 జిల్లాల్లో 6 పశ్చిమ జిల్లాలున్నాయి. ఈరోడ్‌ మినహా కోవైలో 90, నామక్కల్‌లో 74, తిరుప్పూర్‌లో 66, ధర్మపురిలో 58, సేలం జిల్లాలో 51 బాల్యవివాహాలు జరిగాయి. తొలి పది జిల్లాల్లో నామక్కల్‌ జిల్లా ఉన్నా, 2022 నుంచి బాల్యవివాహాల సంఖ్య తగ్గుతుండడం గమనార్హం.


2024లో రాష్ట్రంలో నమోదైన బాల్యవివాహాల సంఖ్య 50 శాతానికి పైగా ఉంది. పెరంబలూరులో 94, దిండుగల్‌లో 77, తిరుపత్తూర్‌లో 66 చొప్పున తొలి పదిస్థానాల్లో నిలిచాయి. గత ఏడాదితో పోల్చితే, పెరంబలూరు, తిరుపత్తూర్‌, కోవై, ధర్మపురి, తిరుప్పూర్‌, నాగపట్టణం, అరియలూరు జిల్లాల్లో బాల్యవివాహాలు పెరిగాయి. అరియలూరులో రెండేళ్ల క్రితం రెండు బాల్య వివాహాలు మాత్రమే జరగ్గా, ఈ ఏడాది ఆ సంఖ్య 31కి చేరడం గమనార్హం.

కారణాలివే..

బాల్యవివాహాలకు ఆర్ధిక వెనుకబాటు, జాతిపరమైన నిర్బంధాలు, అవగాహన లేకపోవడం తదితరాలు ప్రధాన కారణమని సామాజికవేత్తలు చెబుతున్నారు. పాఠశాల విద్య మధ్యలోనే ఆపేసే విధానాన్ని అడ్డుకొనేలా, బాలికలను ఉన్నత విద్యకు ప్రోత్సహిస్తూ ‘పుదుమై పెన్‌’ అనే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినా, బాల్యవివాహాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వివాహాలతో బాలికలు పడే ఇబ్బంది, అనారోగ్యం తదితరాలపై మరింత అవగాహన కల్పించాల్సి ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులు నిజమే

ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్‌ డీపీ మార్చి.. మెసేజ్‌ పంపి..

ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2024 | 12:08 PM