Chennai : క్రిమినల్ చట్టాలపై డీఎంకే న్యాయపోరాటం
ABN, Publish Date - Jul 20 , 2024 | 05:00 AM
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న మూడు క్రిమినల్ చట్టాలను సవాల్ చేస్తూ తమిళనాడులోని డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చెన్నై, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న మూడు క్రిమినల్ చట్టాలను సవాల్ చేస్తూ తమిళనాడులోని డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎస్‌ఎస్ సుందర్, జస్టిస్ సెంథిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం..
పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎన్‌ఆర్ ఇళంగో వాదనలు వినిపిస్తూ.. ఈ క్రిమినల్ చట్టాల ఆమోదం కోసం విపక్ష సభ్యులందరినీ పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసి అత్యవసరంగా ఈ చట్టాలకు ఆమోదముద్ర వేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించలేదని, చట్టాల్లోని కొన్ని నిబంధనలు వ్యక్తిగత స్వేచ్ఛ హరించేలా ఉన్నాయని, అందువల్ల వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలని అభ్యర్థించారు.
Updated Date - Jul 20 , 2024 | 05:00 AM