ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: లడ్డూ కావాలా నాయనా..

ABN, Publish Date - Nov 05 , 2024 | 12:59 PM

శ్రీవారి లడ్డూను భక్తులకు అందుబాటులో వుంచేందుకు పాలకులు మార్గాలు అన్వేషిస్తుంటే.. ఈ లడ్డూలను మరోవిధంగా ఖరీదైన భక్తుల చెంతకు చేర్చేందుకు కొంతమంది టీటీడీ(TTD) సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో టి.నగర్‌ వెంకటనారాయణరోడ్డులో వెంకటేశ్వరస్వామి ఆలయం ఉన్న విషయం తెలిసిందే.

- ఇళ్లకే తీసుకెళ్లి ఇస్తున్న కొంతమంది టీటీడీ సిబ్బంది

- భక్తుల విస్మయం!

చెన్నై: శ్రీవారి లడ్డూను భక్తులకు అందుబాటులో వుంచేందుకు పాలకులు మార్గాలు అన్వేషిస్తుంటే.. ఈ లడ్డూలను మరోవిధంగా ఖరీదైన భక్తుల చెంతకు చేర్చేందుకు కొంతమంది టీటీడీ(TTD) సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో టి.నగర్‌ వెంకటనారాయణరోడ్డులో వెంకటేశ్వరస్వామి ఆలయం ఉన్న విషయం తెలిసిందే. తిరుమల తరహాలోనే ఇక్కడా ఆలయ ప్రాంగణంలోనే లడ్డూలను విక్రయిస్తుంటారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: కస్తూరీ... తెలుగు జాతి చరిత్ర తెలుసా...


అయితే గత కొంతకాలంగా వారానికి రెండుసార్లు తిరుమల(Tirumala) నుంచి లడ్డూలు వస్తుండడంతో భక్తులకు విరివిగా లభ్యమవుతున్నాయి. కొన్నిసార్లు అవసరానికి మించి లడ్డూలు వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొంతమంది ఆలయ సిబ్బంది లడ్డూలను ధనికులైన భక్తుల నివాసాలకు తీసుకెళ్లి ఇస్తున్నట్లు సమాచారం. స్వామివారి ప్రసాదాన్ని అందించి, వారి నుంచి తమకు ‘కావాల్సిన’వి పొందుతున్నట్లు తెలిసింది.


ఇటీవలి కాలంలో ఈ ‘ప్రసాద వితరణ’ మరీ ఎక్కువైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని అరికట్టాలని పలువురు భక్తులు కోరుతున్నారు. దీనిపై ఇప్పటికే టీటీడీ విజిలెన్స్‌(TTD Vigilance)కు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. రెండు వారాల క్రితం ఇక్కడకు తనిఖీకి వచ్చిన విజిలెన్స్‌ అధికారులకు సైతం ఫిర్యాదులందాయి. దీనిపై విజిలెన్స్‌ అధికారులు సైతం ఆరా తీసినట్లు తెలిసింది.


ఈ ఆరోపణలు నిజమని తేలడంతో విజిలెన్స్‌ అధికారులు నివేదికను రూపొందించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే చర్యలుంటాయని టీటీడీ వర్గాలు తెలిపాయి. కాగా ఇద్దరు ఉద్యోగులు సుదీర్థకాలంగా చెన్నై ఆలయంలోనే పని చేయడం పట్ల కూడా విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులందినట్లు తెలిసింది.


ఈవార్తను కూడా చదవండి: మినరల్‌ కాదు.. జనరల్‌ వాటరే

ఈవార్తను కూడా చదవండి: 24 గంటల విద్యుత్‌ అంటూ మోసం: హరీశ్‌రావు

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్‌, హరీశ్‌ ఇళ్ల ముందు ధర్నా చేయండి

ఈవార్తను కూడా చదవండి: అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 05 , 2024 | 01:01 PM