మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chennai: ల్యాండింగ్‌ సమయాల్లో విమానాలపై లేజర్‌ కాంతులు

ABN, Publish Date - May 04 , 2024 | 12:47 PM

చెన్నై జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రాత్రిపూట ల్యాండింగ్‌ అవుతున్న విమానాలపై ఎక్కడి నుంచో లేజర్‌ కాంతులు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ లేజర్‌కాంతులు వేస్తున్న దుండగుల ఆచూకీ కోసం విమానాశ్రయ పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Chennai: ల్యాండింగ్‌ సమయాల్లో విమానాలపై లేజర్‌ కాంతులు

- అధికారుల దిగ్ర్భాంతి

- దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు

చెన్నై: చెన్నై జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రాత్రిపూట ల్యాండింగ్‌ అవుతున్న విమానాలపై ఎక్కడి నుంచో లేజర్‌ కాంతులు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ లేజర్‌కాంతులు వేస్తున్న దుండగుల ఆచూకీ కోసం విమానాశ్రయ పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. లేజర్‌ కాంతులు ప్రసరింపజేస్తున్న వ్యక్తుల ఆచూకీ తెలపాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. విమానాశ్రయం(Airport) అర్ధరాత్రి నుండి వేకువజాము వరకు దేశ, విదేశాల నుండి వచ్చే విమానాలు వరుసగా ల్యాండిగ్‌ అవుతుంటాయి. ఆ సమయాల్లో ఆ విమానాలపై ఎరుపు, పచ్చ, నీలి, పసుపు రంగుల్లో లేజర్‌ కిరణాలు ప్రసారమవుతున్నాయి. ఆ కిరణాల కారణంగా విమానాల ల్యాండింగ్‌పై దృష్టిసారిస్తున్న పైలెట్ల కన్నులు కొన్ని సెకన్ల పాటు చెదరి ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉందని విమానాశ్రయ భద్రతా విభాగం అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ లేజర్‌ కిరణాల కారణంగా పైలెట్లు ల్యాండింగ్‌ చేయడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ లేజర్‌ కిరణాల ఇబ్బందులు అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు జరుగుతున్నాయని అధికారుల చెబుతున్నారు.

ఇదికూడా చదవండి: Indian Railways: దేశవ్యాప్తంగా 69 రైళ్ల రద్దు, 107 దారి మళ్లింపు.. ఎందుకంటే

ఎక్కడి నుంచి వస్తున్నాయంటే...?

విమానాలపై పడే లేజర్‌ కిరణాలు ఏయే ప్రాంతాల నుంచి వస్తున్నాయో విమానాశ్రయ భద్రతా దళం అధికారులు గుర్తించారు. ఆ లేజర్‌ కిరణాలు పరంగిమలై, నందంబాక్కం, పల్లవంతాంగల్‌ ప్రాంతాల నుంచి తరచూ వస్తున్నట్లు గుర్తించారు. కొన్ని నెలల క్రితం చేపాక్‌ ప్రాంతం నుంచి కూడా లేజర్‌ కిరణాలు ప్రసరించాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం ఉన్నతాధికారులు శుక్రవారం ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. విమానాలపై లేజర్‌ కిరణాలను వేయడం నేరమని, కఠిన శిక్ష పడుతుందని హెచ్చరించారు. నగర వాసులు తమ ప్రాంతాల్లో ఎత్తయిన ప్రాంతాల నుంచి కానీ, బహుళ అంతస్థుల భవనాల పైనుంచి గాని లేజర్‌ కిరణాలు ప్రసారం చేస్తుంటే వెంటనే స్థానిక పోలీసులకు గానీ, కంట్రోలు రూం నెంబర్‌కు గాని ఫోన్‌ చేసి తెలపాలని, ఈ విషయంలో తమకు అన్నివిధాలా సహకరించాలని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయం పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు లేజర్‌ కిరణాలు ప్రసారం చేసేవారి గురించి సమాచారాన్ని వెనువెంటనే తెలపాలని కోరారు.

ఇదికూడా చదవండి: Chennai: ఇక భగభగలే.. నేటినుంచి అగ్నినక్షత్రం ప్రారంభం

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 04 , 2024 | 12:47 PM

Advertising
Advertising