ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chennai: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు రెడ్‌ అలెర్ట్‌

ABN, Publish Date - May 19 , 2024 | 11:56 AM

నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పవాయుపీడనం ఏర్పడనుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆ అల్పపీడనం వాయవ్యదిశగా ప్రయాణించి ఈనెల 24న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని తెలిపారు.

- దక్షిణాది జిల్లాలను ముంచెత్తిన వాన

- సహాయక చర్యలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళం

చెన్నై: నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పవాయుపీడనం ఏర్పడనుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆ అల్పపీడనం వాయవ్యదిశగా ప్రయాణించి ఈనెల 24న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని తెలిపారు. ఆది, సోమవారాల్లో కుండపోతగా వర్షాలు కురవనుండటంతో దక్షిణ రాష్ట్రానికి రెండు రోజుల రెడ్‌ అలెర్ట్‌(Red alert) ప్రకటించారు. రాష్ట్రంలో శనివారం ఉదయం పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ఈనెల 21, 22 తేదీల్లోనూ రాష్ట్రంలో దక్షిణాది జిల్లాల్లో కుండపోతగా, చెదురుమదురుగా వర్షాలు కురవనున్నాయి. ఆదివారం నుంచి 21 వరకు తేని, తెన్‌కాశి, కన్నియాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్ర అధికారులు ప్రకటించారు. శనివారం సాయంత్రం తెన్‌కాశి, తేనీ, కోయంబత్తూరు, నీలగిరి(Thenkashi, Theni, Coimbatore, Nilgiris) జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఆదివారం కన్నియాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి, దిండుగల్‌ జిల్లాల్లో భారీగా, నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూరు, తూత్తుకుడి, విరుదునగర్‌, మదురై, శివగంగ, రామనాధపురం, పుదుకోట జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆదివారం కన్నియాకుమారి, మన్నార్‌ జలసంధి తదితర సముద్రతీర ప్రాంతాల్లో గంటలకు 40 నుంచి 45 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని, ఈ ప్రాంతాల్లో జాలర్లు ఈనెల 21 వరకు చేపలవేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

ఇదికూడా చదవండి: Dengue: తమిళనాడులో విజృంభిస్తున్న డెంగ్యూ..


నాలుగు జిల్లాల్లో సాయానికి రెడీ...

భారత వాతావరణ పరిశోధన కేంద్రం జారీ చేసిన రెడ్‌ అలెర్ట్‌ ప్రకారం నాలుగు జిల్లాల్లో వర్ష, వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళం తగిన రక్షణ సామగ్రితో సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటన జారీ చేసింది. ఆ మేరకు తలా 30 మంది సభ్యులు కలిగిన మూడు దళాలు తిరునల్వేలి, కన్నియాకుమారి, నీలగిరి జిల్లాలకు పయనమయ్యాయి. ఇదే విధంగా కోయంబత్తూరు జిల్లాకు కూడా ఓ బృందం తరలివెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు అరక్కోణంలోని జాతీయ విపత్తుల నిర్వహణ బృందం సభ్యులు కూడా సిద్ధమయ్యారు.


ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 19 , 2024 | 11:56 AM

Advertising
Advertising