ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: నటి కస్తూరిపై ఎంపీ రాజా ఆగ్రహం.. ద్రావిడ పాలనలో ఆర్య ఆధిక్యాన్ని సహించం

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:13 AM

తెలుగు ప్రజలను ఉద్దేశించి సినీ నటి కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. రెండు కోట్ల మందికి పైగా తెలుగు ప్రజలను కించపరుస్తూ, అవమానించేలా మాట్లాడి, వారి మనోభావాలను దెబ్బతీసిన నటి కస్తూరి(Kasturi)పై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా(A. Raja)తో పాటు పలు తెలుగు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

- చెన్నై, మదురైల్లో పోలీసులకు ఫిర్యాదు

చెన్నై: తెలుగు ప్రజలను ఉద్దేశించి సినీ నటి కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. రెండు కోట్ల మందికి పైగా తెలుగు ప్రజలను కించపరుస్తూ, అవమానించేలా మాట్లాడి, వారి మనోభావాలను దెబ్బతీసిన నటి కస్తూరి(Kasturi)పై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా(A. Raja)తో పాటు పలు తెలుగు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అదేసమయంలో నటి కస్తూరిపై చెన్నై, మదురై పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయాల్లో ఫిర్యాదులు కూడా చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: వాతావరణ మార్పులు.. ప్రబలుతున్న ‘మద్రాసు ఐ’


ఇటీవల నగరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేతలు అర్జున్‌ సంపత్‌, గురుమూర్తి కలిసి సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటి కస్తూరి ప్రసంగిస్తూ రాజుల వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగు ప్రజలు వచ్చారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై పెను దుమారం రేగడంతో ఆమె వివరణ కూడా ఇచ్చారు. అయినప్పటికీ.. నిరసనజ్వాల చల్లారలేదు. ఈ విషయంపై తమిళగ నాయుడు మహాజన సంఘం ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి శృతి రమేష్‌, బోస్‌, రామమోహన రావు పాసరై తరపున ప్రభు కలిసి మదురై పోలీస్‌ కమిషనర్‌ లోకనాథన్‌కు వినతి పత్రం సమర్పించి, కస్తూరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.


అలాగే, సేలంలో దేశీయ తెలుంగార్‌ మైనార్టీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నాగ అరవిందన్‌ కూడా సినీ నటిపై చర్య తీసుకోవాలని చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. నగరానికి చెందిన సంఘ సేవకురాలు వీరలక్ష్మి(Veeralakshmi) కూడా చెన్నై పోలీస్‌ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. తెలుగు ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటమే కాకుండా ఎన్నో దశాబ్దాలుగా సోదరభావంతో మెలుగుతున్న తమిళ, తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా నటి కస్తూరి వ్యాఖ్యలు చేశారన్నారు.


రెండు భాషలకు చెందిన ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు కస్తూరిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా మాట్లాడుతూ.. నటి కస్తూరి కేవలం తెలుగు ప్రజలను మాత్రమే కాకుండా, మహళలను కూడా కించపరిచేలా మాట్లాడారని, ఈ తరహా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అణగారిన వర్గాలకు చెందిన ప్రజలను నేరస్థులుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రావిడ పాలనలో ఆర్య ఆధిపత్యాన్ని సహించే ప్రసక్తే లేదని రాజా స్పష్టం చేశారు.


ఈవార్తను కూడా చదవండి: అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి దుర్మరణం

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా

ఈవార్తను కూడా చదవండి: Medical Student: అయ్యా.. నాది ఏ రాష్ట్రం?

ఈవార్తను కూడా చదవండి: Uttam: కేంద్ర నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 06 , 2024 | 11:13 AM