Chennai: వచ్చే నెలలో తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన..
ABN, Publish Date - Aug 10 , 2024 | 11:07 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) వచ్చే నెలలో రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో తిరిగే రెండు వందే భారత్ రైళ్లతోపాటు రామేశ్వరం - పాంబన్(Rameshwaram - Pamban) వంతెనను కూడా ఆయన ప్రారంభించనున్నారు.
- రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభం
- అదే రోజు రామేశ్వరం వంతెన కూడా
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) వచ్చే నెలలో తమిళనాడులో పర్యటించనున్నారు. రాష్ట్రంలో తిరిగే రెండు వందే భారత్ రైళ్లతోపాటు రామేశ్వరం - పాంబన్(Rameshwaram - Pamban) వంతెనను కూడా ఆయన ప్రారంభించనున్నారు. అయితే ప్రధాన పర్యటన అధికారికంగా ఖరారు కావాల్సి వుంది. చెన్నై - నాగర్‌కోయిల్, మదురై-బెంగళూరు మధ్య కొత్తగా వందేభారత్(Vande Bharat) రైళ్లను నడపాలని దక్షిణ రైల్వే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన తుది విడత పనులు కూడా పూర్తయ్యాయి. నిజానికి జూన్‌లోనే ఈ రెండు రైళ్లను ప్రధాని ప్రారంభించాల్సివుంది.
ఇదికూడా చదవండి: Chennai: చెన్నై విమానాశ్రయంలో ఏడంచెల భద్రత
కానీ కోల్‌కతలో సంభవించిన ఘోర రైలు ప్రమా దం, చెన్నై - తాంబరం - మదురై మార్గంలో రైల్వే పనుల్లో జాప్యం కారణంగా ఆ రెండు సర్వీసులు ప్రారంభం కాలేకపోయాయి. అయితే ఇప్పుడు అన్నీ సద్దుమణగడంతో ఈ రెండు రైళ్లను నడపాలని దక్షిణరైల్వే నిర్ణయించింది. దీంతో పాటు మరో 8 మార్గాల్లోనూ వందేభారత్ సేవలు అందనున్నాయి. ఐసీఎఫ్‌లో ఇప్పటికే 70 వందేభారత్ రైళ్లు సిద్ధమవ్వగా, ఇందులో 51 రైళ్లు పరుగులు పెడుతున్నాయి. 9 రైళ్లను అత్యవసర సేవలకు వుంచగా, మరో 10 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కేందుకు ఎదురు చూస్తున్నాయి. అందులో రెండు రైళ్లు వచ్చే నెల చెన్నై - నాగర్‌కోయిల్, మదురై - బెంగళూరు(Chennai - Nagercoil, Madurai - Bangalore) మధ్య పరుగులు పెట్టనున్నాయి.
వాటిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. పాంబన్-రామేశ్వరం మార్గంలో వంతెన పనులు పూర్తి కావచ్చాయి. దానిని కూడా సెప్టెంబరులో ప్రారంభించేందుకు దక్షిణరైల్వే సన్నాహాలు చేస్తోంది. వందేభారత్ రైళ్లను, పాంబన్ వంతెనను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రా రంభిస్తారని రైల్వే అధికారులు తెలిపారు. అయి తే ఏ వేదిక నుంచి వాటిని ప్రారంభిస్తారన్నది ఇంకా ఖరారు కాలేదని వారు పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్ క్రైంలో కేసు నమోదు..
Read Latest Telangana News and National News
Updated Date - Aug 10 , 2024 | 11:07 AM