ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai : కోయంబత్తూరులో మహిళా డాక్టర్‌పై అత్యాచారయత్నం

ABN, Publish Date - Aug 17 , 2024 | 03:52 AM

తమిళనాడులోని కోయంబత్తూరు వైద్యకళాశాల ఆసుపత్రి వద్ద బుధవారం రాత్రి ఓ మహిళా వైద్యురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఆగంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

చెన్నై, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కోయంబత్తూరు వైద్యకళాశాల ఆసుపత్రి వద్ద బుధవారం రాత్రి ఓ మహిళా వైద్యురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఆగంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటనను ఖండిస్తూ కోయంబత్తూరు ఆసుపత్రి వైద్యులు సుమారు 150 మంది గురువారం ధర్నా నిర్వహించారు. బుధవారం రాత్రి ఆ మహిళా వైద్యురాలు వాహనాల పార్కింగ్‌ ప్రాంతంలో తన స్కూటర్‌ను తీసుకునేందుకు వెళుతుండగా ఆమెను వెంబడించిన ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

ఈ విషయమై ఆ ఆసుపత్రి డీన్‌ డాక్టర్‌ నిర్మల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దుండగుడిని అరెస్టు చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా వైద్యులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించామని, ఆగంతకులు ఎవరూ చొరబడకుండా ఉండేందుకు ఇటీవలే వెనుకవైపు గేటును కూడా మూసివేశామని డీన్‌ ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - Aug 17 , 2024 | 03:52 AM

Advertising
Advertising
<