Chennai: రాష్ట్రంలో రాజకీయ వెలితి కొనసాగుతోంది.. ఈమాట అన్నది ఎవరో తెలిస్తే..
ABN, Publish Date - Nov 23 , 2024 | 12:28 PM
సూపర్‌స్టార్ రజనీకాంత్ గతంలో ప్రకటించినట్లుగానే రాష్ట్రంలో మంచి పరిపాలకులు లేక ఇంకా రాజకీయ వెలితి కొనసాగుతూనే ఉందని, పుట్టగొడుగుల్లా రాజకీయ నేతలు పుట్టుకొస్తున్నారని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్(Seeman) తెలిపారు.
- వాటిపైనే చర్చించాం
- రజనీతో భేటీ అనంతరం సీమాన్
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ గతంలో ప్రకటించినట్లుగానే రాష్ట్రంలో మంచి పరిపాలకులు లేక ఇంకా రాజకీయ వెలితి కొనసాగుతూనే ఉందని, పుట్టగొడుగుల్లా రాజకీయ నేతలు పుట్టుకొస్తున్నారని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్(Seeman) తెలిపారు. పోయెస్ గార్డెన్‌లో రజనీకాంత్(Rajanikanth)ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అరగంటసేపు సమావేశమై రాష్ట్రంలో డీఎంకే పరిపాలన, విజయ్ రాజకీయ ప్రవేశం, 2026లో జరుగనున్న ఎన్నికలు గురించి ఇద్దరూ చర్చలు జరిపారు.
ఈ వార్తను కూడా చదవండి: సనాతనం వేరు.. దేవుడిపై నమ్మకం వేరు
వీరి భేటీ రాజకీయపరంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సీమాన్ మీడియాతో మాట్లాడుతూ... రజనీతో తాను రాజకీయాల కోసం చర్చించానని, ఈ నెల 8న తన జన్మదినం సందర్భంగా రజినీ నుంచి శుభాకాంక్షలు అందుకోవాలనుకున్నానని, ఆ సమయంలో రజనీకి షూటింగ్ వున్నందున కలుసుకోలేకపోయానని చెప్పారు. ఇప్పుడు ఆయన నగరానికి తిరిగి రావటంతో తనను ఆహ్వానించి శుభాకాంక్షలు చెప్పారని సీమాన్ వివరించారు.
రజనీతో స్నేహపూర్వకమైన భేటీయే అయినా రాజకీయ, చిత్రసీమకు సంబంధించి వివిధ అంశాలపై మాట్లాడుకున్నట్టు తెలిపారు. రజనీ రాజకీయ ప్రవేశం చేయకుండా ప్రశాంతంగా సినిమాల్లో నటిస్తూ హాయిగా ఉంటున్నారని, తనకన్నా సీనియర్ నటుడని, కనుకనే ఆయన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తానని సీమాన్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి స్టాలిన్ వియ్యంకుల్లా తరచూ కలుసుకుంటున్నారని, అయితే బయటికి బద్దశత్రువుల్లా వ్యవహరిస్తున్నారని సీమాన్ విమర్శించారు.
ఈవార్తను కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఈవార్తను కూడా చదవండి: Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!
ఈవార్తను కూడా చదవండి: వామ్మో...చలి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 23 , 2024 | 12:28 PM