ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chennai: తీరంలో ‘అల’జడి.. సముద్రతీరప్రాంతాల్లో పెనుగాలులు

ABN, Publish Date - Jun 13 , 2024 | 11:51 AM

కన్నియాకుమారి నుంచి పళవేర్కాడు దాకా సముద్రతీరం పొడవునా బుధవారం ఉదయం ‘అల’జడి అధికమైంది. కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీరంలో మన్నార్‌ జలసంధి వద్ద పెనుగాలలు వీయడంతో అలలు ఎగసి పడుతున్నాయి.

- చేపలవేటకు వెళ్లొద్దన్న అధికారులు

చెన్నై: కన్నియాకుమారి నుంచి పళవేర్కాడు దాకా సముద్రతీరం పొడవునా బుధవారం ఉదయం ‘అల’జడి అధికమైంది. కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీరంలో మన్నార్‌ జలసంధి వద్ద పెనుగాలలు వీయడంతో అలలు ఎగసి పడుతున్నాయి. సముద్రతీర ప్రాంతాల్లోల పెనుగాలులు వీస్తుండటంతో జాలర్లు చేపలవేటకు వెళ్ళకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం వాతావారణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కన్నియాకుమారి సముద్రతీరంలో మన్నార్‌(Mannar) జలసంధి వద్ద గంటలకు 45 నుంచి 55 కి.మీల వేగంతో పెనుగాలలులు వీస్తున్నాయి. దీంతో జాలర్లు చేపలవేటకు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మహిళను బెదిరించి రూ.6.45 లక్షలు లూటీ చేసేశారు..


నగరంలోని మెరీనాబీచ్‌, పట్టినంబాక్కం బీచ్‌(Marina Beach, Pattinambakkam Beach), తిరువాన్మియూరు బీచ్‌ తదితర ప్రాంతాల్లో బుధవారం వేకువజాము నుంచే అలల ఉదృతి అధికమైంది. కాశిమేడు చేపలరేవు వద్ద కూడా అలలు తీరం వైపు వేగంగా దూసుకువస్తున్నాయి. తిరునల్వేలి, తెన్‌కాశి, నీలగిరి, కోయంబత్తూరు, చెన్నై, కాంచీపురం, తిరుళ్లూరు ప్రాంతాల్లోనూ చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో పెనుగాలులతో పాటు అలలు ఎగసిపడుతుండటంతో జాలర్లు చేపలవేటకు వెళ్ళకూడదని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 11:51 AM

Advertising
Advertising