జమిలి సాధ్యం కాదు: చిదంబరం
ABN, Publish Date - Sep 17 , 2024 | 04:27 AM
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ప్రకారం జమిలి ఎన్నికలు సాధ్యంకావని తెలిపారు.
ఛండీగఢ్, సెప్టెంబరు 16: జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ప్రకారం జమిలి ఎన్నికలు సాధ్యంకావని తెలిపారు. జమిలి జరగాలంటే కనీసం ఐదు రాజ్యాంగ సవరణలైనా చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలు(జమిలి) ఈ టర్మ్‌లోనే నిర్వహించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు భావిస్తున్నదంటూ వస్తున్న వార్తలపై సోమవారం ఆయన స్పందించారు. ‘‘జమిలి నిర్వహణకు రాజ్యాంగపరమైన అనేక అడ్డంకులు ఉన్నాయి. ప్రధాని మోదీకి రాజ్యాంగాన్ని సవరించేంత సంఖ్యా బలం పార్లమెంటు ఉభయ సభల్లోనూ లేదు. ఇక, మా విషయానికి(ఇండియా కూటమి) జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం’’ అని చిదంబరం వ్యాఖ్యానించారు. అక్టోబరు 5న జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.
Updated Date - Sep 17 , 2024 | 04:27 AM