ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rajiv Kumar: సీఈసీ రాజీవ్‌కుమార్‌కు 'జడ్' కేటగిరి భద్రత

ABN, Publish Date - Apr 09 , 2024 | 02:41 PM

లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు సాయిధ కమెండోలతో జడ్-కేటగిరి భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఎన్నికల నేపథ్యంలో సీఈసీకి ముప్పు పొంచి ఉందంటూ కేంద్ర భద్రతా సంస్థల నివేదిక ఆధారంగా కేంద్ర హోం శాఖ తాజా భద్రత కల్పించింది.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) తరుముకొస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్‌ (Rajiv Kumar)కు సాయిధ కమెండోలతో జడ్-కేటగిరి (Z-category) భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఎన్నికల నేపథ్యంలో సీఈసీకి ముప్పు పొంచి ఉందంటూ కేంద్ర భద్రతా సంస్థల నివేదిక ఆధారంగా కేంద్ర హోం శాఖ తాజా భద్రత కల్పించింది.

Lok Sabha Elections: తొలిసారి కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశం కోల్పోయిన ఆ నలుగురు..


'జడ్' కేటగిరి భద్రత కింద సెంట్రల్ రిజర్స్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 40 నుంచి 45 మంది సిబ్బంది సీఈసీ రక్షణ విధుల్లో ఉంటారు. దేశ వ్యాప్తంగా ఆయన ఎక్కడ పర్యటించినా ఆయన వెంట ఈ సిబ్బంది ఉంటారు. 1984 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కుమార్ 2022 మే 15వ తేదీన భారతదేశ 25 ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఏప్రిల్ 19వ తేదీతో మొదలై 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగునుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2024 | 02:41 PM

Advertising
Advertising