Chief Minister: ప్రధానిని చేస్తామన్నా నేను బీజేపీవైపు వెళ్లను..
ABN , Publish Date - Apr 04 , 2024 | 01:45 PM
దేశానికి ప్రధానమంత్రిని చేస్తామని హామీ ఇచ్చినా బీజేపీవైపు వెళ్లేది లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు.
- దళితులు, మహిళలకు ఆర్ఎస్ఎస్లోకి ప్రవేశం లేదు
- ముఖ్యమంత్రి సిద్దరామయ్య
బెంగళూరు: దేశానికి ప్రధానమంత్రిని చేస్తామని హామీ ఇచ్చినా బీజేపీవైపు వెళ్లేది లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు. సిద్ధాంతపరమైన స్పష్టత ఉన్నప్పుడే రాజకీయశక్తి సాధ్యమవుతుందన్నారు. బుధవారం మైసూరు కాంగ్రెస్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎం. లక్ష్మణ్ తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆర్‌ఎ్‌సఎస్ గర్భగుడిలోకి దళితులు, శూద్రులు, మహిళలకు ప్రవేశమే లేదన్నారు. మోదీ ప్రధాని అయితే దేశం వీడుతానన్న దేవెగౌడ ఇప్పుడు ఆయనతోనే అవినాభావ సంబంధం అంటున్నారని, రాజకీయ నేతలకు సిద్ధాంతపరమైన స్పష్టత ఉండాలని హితవు పలికారు. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సకు సామాజిక న్యాయం అంటే పట్టదని, రిజర్వేషన్ అంటే ఇష్టపడరని విమర్శించారు. రిజర్వేషన్ అనేది భిక్ష కాదని, వెనుకబడిన వర్గాల హక్కు అన్నారు. మైసూరు అభ్యర్థి ఎం. లక్ష్మణ్ నామినేషన్ దాఖలులో భాగస్వామ్యులయ్యారు. ఆ తర్వాత చామరాజనగర అభ్యర్థి సునిల్‌బోస్ నామినేషన్‌లోనూ పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు మహదేవప్ప, వెంకటేశ్, పరమేశ్వర్‌తోపాటు పలువురు భాగస్వామ్యులయ్యారు.
ఇదికూడా చదవండి: Sumalata: తేల్చిచెప్పేశారు.. ఎన్నికల్లో పోటీ చేయను.. త్వరలోనే బీజేపీలో చేరుతా