Chief Minister: సారా వ్యాపారులపై ఉక్కుపాదం...
ABN, Publish Date - Jun 23 , 2024 | 11:39 AM
రాష్ట్రంలో సారా వ్యాపారులను ఉక్కుపాదంతో అణచివేయాలని, ఆ దుండగులు ఏ పార్టీకి చెందినవారైనా వెనుకాడకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.
- కలెక్టర్లకు సీఎం స్టాలిన్ ఆదేశం
- రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు
- 876 మంది అరెస్ట్
చెన్నై: రాష్ట్రంలో సారా వ్యాపారులను ఉక్కుపాదంతో అణచివేయాలని, ఆ దుండగులు ఏ పార్టీకి చెందినవారైనా వెనుకాడకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సారా వ్యాపారులను, వారికి అన్ని విధాల సహకరిస్తున్న రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. సారా విక్రయాలకు సంబంధించిన పాత కేసుల దుమ్ముదులిపి నేరస్తులపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాకుండా సారా వ్యాపారుల వెనుక ఉన్న బడా నేతలెవరో కనుగొని వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, కళ్ళకుర్చి దుర్ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు సమన్వయంతో తరచూ ముమ్మర తనిఖీలు కూడా జరపాలని స్పష్టం చేశారు.
ఇదికూడా చదవండి: ఇంట్లో నుంచి వెళ్లిన కాప్.. మహిళ కానిస్టేబుల్‌తో ఏకాంతంగా..
రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు
సీఎం స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో ఎక్సైజ్ విభాగ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ఉత్తర జిల్లాల్లో మాత్రమే 876 మంది సారా వ్యాపారులను అరెస్ట్ చేశారు. అడవులు, కొండ ప్రాంతాలు, జనసంచారం లేని ప్రాంతాలు, ముఖ్యంగా సారా తయారు చేసే బట్టీలు వద్దకు పోలీసు బృందాలు చేరుకొని, కడలూరు, విల్లుపురం, కళ్లకుర్చి, సేలం, కాంచీపురం, తిరువణ్ణామలై, తిరువళ్లూర్, చెంగల్పట్టు తదితర 8 జిల్లాల్లో శనివారం ఉదయం వరకు 876 మంది సారా వ్యాపారులను అరెస్ట్ చేశారు. ఇదికాకుండా, 4,657 లీటర్ల సారాను ధ్వంసం చేశారు.
తిరుచ్చి జిల్లాలో...
తిరుచ్చి జిల్లా దురైయూర్ తాలూకా, పచ్చమలై సమీపంలో పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో 250 లీటర్ల సారాను గుర్తించి ధ్వంసం చేశారు. పచ్చమలైలో జిల్లా ఎస్పీ ప్రదీప్ కుమార్, ఎస్పీ వరుణ్ కుమార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. అదేవిధంగా నాగపట్టినం జిల్లాలో రెండు రోజుల కిత్రం పోలీసులు, అబ్కారీ శాఖ సిబ్బంది తనిఖీల్లో వెయ్యి లీటర్ల సారాని స్వాధీనం చేసుకుని 15 మందిని అరెస్టు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సారా పుదుచ్చేరిలో తయారైనట్టు గుర్తించారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 23 , 2024 | 11:39 AM