ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vande Bharat Trains: మన వందే భారత్ రైళ్లకు విదేశాల్లో డిమాండ్.. కొనుగోలుకు ఆసక్తి

ABN, Publish Date - Sep 28 , 2024 | 09:41 AM

ఇటివల మన దేశంలో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల్లోనూ క్రేజ్ వచ్చింది. అంతేకాదు పలు దేశాలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కూడా చూపిస్తున్నాయి. అయితే వారు కొనుగోలు చేసేందుకు గల కారణాలు కూడా చెప్పారు. వారు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.

vande bharat express trains

స్వదేశంలో తక్కువ ఖర్చుతో తయారైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు(vande bharat express trains) ఇప్పుడు విదేశాల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో చిలీ, కెనడా, మలేషియా వంటి దేశాలు భారత్ నుంచి వందే భారత్ రైళ్లను దిగుమతి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. బయటి కొనుగోలుదారులు వందే భారత్ వైపు ఆకర్షితులవడానికి అనేక కారణాలు ఉన్నాయని కూడా ఆయా వర్గాలు చెబుతుండటం విశేషం. ప్రధాన కారకాల్లో ఒకటి ఖర్చు అని అన్నారు. ఇతర దేశాల్లో తయారయ్యే ఇలాంటి రైళ్ల ధర దాదాపు రూ. 160-180 కోట్లు కాగా, ఇక్కడ వందే భారత్ రైలు రూ. 120-130 కోట్లకు మాత్రమే లభిస్తుంది. దీంతో వారికి సుమారు 40 నుంచి 50 కోట్లు ఆదా అవుతున్నాయని చెప్పవచ్చు.


స్పీడ్ విషయంలో

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగం కూడా అద్భుతంగా ఉంటుంది. వందేభారత్ ట్రైన్ ప్రస్తుతం 0 నుంచి 100 కి.మీ వేగాన్ని చేరుకోవడానికి కేవలం 52 సెకన్లు మాత్రమే పడుతుంది. ఈ విషయంలో జపాన్ బుల్లెట్ రైలు కంటే వందే భారత్ మెరుగైనది. జపాన్ ట్రైన్ 0-100 kmph వేగానికి చేరుకోవడానికి 54 సెకన్లు పడుతుంది. దీంతోపాటు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు డిజైన్‌ని అనేక మంది ఇష్టపడతారు. విశేషమేమిటంటే, ఇది విమానం కంటే 100 రెట్లు తక్కువ శబ్దాన్ని అందిస్తుంది. దీని శక్తి వినియోగం కూడా తక్కువ కావడంతో పలు దేశాలు ఈ ట్రైన్లపై మక్కువ చూపుతున్నాయి.


రైళ్లను పెంచేందుకు కృషి

ఈ క్రమంలోనే భారతీయ రైల్వే తన ట్రాక్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. అలాగే వందేభారత్ రైళ్లను కూడా తగిన సంఖ్యలో పెంచేందుకు కసరత్తు చేస్తోంది. గత పదేళ్లలో 31,000 కిలోమీటర్లకు పైగా ట్రాక్‌లను ఆధునీకరించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. త్వరలో 40,000 కిలోమీటర్ల అదనపు ట్రాక్‌ను ఆధునీకరిస్తామన్నారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనులు పూర్తైన వెంటనే ఆయా మార్గాల్లో మరికొన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి అన్నారు.


బుల్లెట్ ట్రైన్

మరోవైపు బుల్లెట్ రైలుకు సంబంధించిన పనులు ట్రాక్‌లో ఉన్నాయని, చాలా వేగంగా జరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్ గుర్తు చేశారు. అదే సమయంలో భద్రతా సమస్యలకు సంబంధించి పకడ్బందీ వ్యవస్థను విస్తరించే పనిలో ఉన్నామని అన్నారు. ఇది దాదాపు 40000 కిమీ నెట్‌వర్క్‌ను కవర్ చేస్తుందని, 1,0000 లోకోమోటివ్‌లలో ఇన్‌స్టాల్ చేయబడుతుందని వెల్లడించారు. ఆర్మర్ అనేది సమర్థవంతమైన, తక్కువ ధర భద్రతా వ్యవస్థ అని గుర్తు చేశారు.


ఇవి కూడా చదవండి:

Financial Deadline: ఈ లావాదేవీలకు ఈ నెల 30 చివరి తేదీ.. లేదంటే మీకే నష్టం..


Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..


Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 28 , 2024 | 09:43 AM