Passengers : ‘వందేభారత్’ భోజనంలో బొద్దింక
ABN, Publish Date - Jun 21 , 2024 | 03:03 AM
వందేభారత్ రైల్లో సరఫరా చేస్తున్న భోజనంలో బొద్దింక రావడంతో సదరు ప్రయాణికులు షాకైయ్యారు. మంగళవారం భోపాల్ నుంచి ఆగ్రాకు వెళ్తున్న ఓ దంపతులకు ఐఆర్‌సీటీసీ అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది.
న్యూఢిల్లీ, జూన్ 20: వందేభారత్ రైల్లో సరఫరా చేస్తున్న భోజనంలో బొద్దింక రావడంతో సదరు ప్రయాణికులు షాకైయ్యారు. మంగళవారం భోపాల్ నుంచి ఆగ్రాకు వెళ్తున్న ఓ దంపతులకు ఐఆర్‌సీటీసీ అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది. దీంతో ఆశ్చర్యపోయిన ప్రయాణికులు ఆ విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆ పోస్టు వైరల్‌గా మారడంతో ఐఆర్‌సీటీసీ గురువారం స్పందించింది.
‘‘మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి. భోజనం సరఫరా చేసిన సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై తగిన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొంది. ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లలో అపరిశుభ్ర వాతావరణం ఉండడం, ప్రయాణికులకు అందించే భోజనంలో బొద్దింక రావడం వంటి ఘటనలపై ప్రయాణికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jun 21 , 2024 | 03:03 AM