Maharashtra: మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య.. స్పందించిన రాహుల్ గాంధీ
ABN, Publish Date - Oct 13 , 2024 | 12:27 PM
ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యపై లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆదివారం తన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ హత్య ఘటనతో మహారాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయనే విషయం తేటతెల్లమవుతుందన్నారు. ఈ హత్య ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యపై లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆదివారం తన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ హత్య ఘటనతో మహారాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయనే విషయం తేటతెల్లమవుతుందన్నారు. ఈ హత్య ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో న్యాయం గెలవాలన్నారు. అయితే బాబా హత్య వార్త తానను షాక్‌కు గురి చేసిందని చెప్పారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలిపారు. ఈ సందర్బంగా బాబా కుటుంబానికి రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read: కూతురుని చంపాలనుకున్న తల్లి.. మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఇచ్చిన లవర్..
శనివారం రాత్రి 9.30 గంటలకు బాంద్రాలోని తన కుమారుడు జీషన్ సిద్దిఖీ కార్యాలయం వెలుపల మాజీ మంత్రి బాబా సిద్దిఖీపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన కుప్పకూలిపోయారు. దీంతో ఆయనని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ కాల్పులు జరిపింది బిష్ణోయ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తున్నారు. ఆ క్రమంలో ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 66 ఏళ్ల బాబా సిద్దిఖీ బాంద్రా పశ్చిమ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ హత్య ఘటనపై విచారణను ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
Also Read : అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?
ఇక ఈ హత్యపై ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీ సుప్రీయా సులే సైతం స్పందించారు. ఈ హత్య ఘటన రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతుందని అన్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తికే ఈ విధంగా జరిగితే ఎలా అని ఆమె ప్రశ్నించారు.
Also Read: ఏపీకి భారీ వర్ష సూచన.. హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల
ఈ తరహా ఘటనలు ఏ మాత్రం ఆమోదయోగ్యమైనవి ఆమె స్పష్టం చేశారు. ఇక మహారాష్ట్ర మంత్రి ఛగన్ బుజబల్ మాట్లాడుతూ.. బాబా సిద్దిఖీ హత్య కేసుతోపాటు బైకుల్లా తాలుక అధ్యక్షుడు సచిన్ కుర్మి హత్య కేసులో విచారణను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆయన విజ్జప్తి చేశారు.
Also Read: మునక్కాయతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..?
Read More National News and Latest Telugu News
Updated Date - Oct 13 , 2024 | 12:27 PM