ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

June 25:‘మోదీ ప్రభుత్వ ప్రకటనపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ

ABN, Publish Date - Jul 12 , 2024 | 06:16 PM

దేశంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని ఇకపై సంవిధాన్ హత్య దినోత్సవంగా జరపాలని నిర్ణయించినట్లు మోదీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ తనదైనశైలిలో స్పందించింది.

Congress party Senior Leader Jairam Ramesh

న్యూఢిల్లీ, జులై 12: దేశంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని ఇకపై సంవిధాన్ హత్య దినోత్సవంగా జరపాలని నిర్ణయించినట్లు మోదీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ తనదైనశైలిలో స్పందించింది. జూన్ 4వ తేదీని ‘మోదీ ముక్త దివస్‌’గా జరుపుకోవాలని హస్తం పార్టీ పిలుపునిచ్చింది. దేశంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వివిధ దశల్లో జరిగింది. ఆ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు 293 మంది సభ్యులు కావాల్సి ఉంది. ఆ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ తన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధార పడాల్సి వచ్చింది.

Also Read: Modi Govt: ‘జూన్ 25’ సంవిధాన్ హత్య దినోత్సవంగా ప్రకటించిన కేంద్రం

Also Read: Arvind Kejriwal bail: ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం


అలా మోదీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 25వ తేదీపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్‌ పైవిధంగా స్పందించారు. అంతేకాదు.. మోదీ ప్రస్తుత పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందన్నారు. పదేళ్ల క్రితమే కపటత్వంతో అప్రకటిత ఎమర్జెన్సీని భారత ప్రజలపై జీవశాస్త్రేతర ప్రధానమంత్రి విధించారని ఆయన పేర్కొన్నారు. అయితే 2024, జూన్ 4వ తేదీన నిర్ణయాత్మకంగా.. వ్యక్తిగతంగా.. రాజకీయంగా.. నైతికంగా నరేంద్ర మోదీ ఓటమిపాలైయ్యారన్నారు. ఆ క్రమంలోనే జూన్ 4వ తేదీన ఇకపై మోదీ ముక్తి దివాస్ జరుపుకోవాలని జైరాం రమేష్ తన ట్విట్‌లో స్పష్టం చేశారు.

Also Read: Puja Khedkar: మనోరమా కేడ్కర్ తుపాకీతో హల్‌చల్.. వీడియో వైరల్

Also Read: Punjab: ఎంపీ అమృత్ పాల్ సింగ్ సోదరుడు అరెస్ట్


అంతేకాదు.. భారత రాజ్యాంగం, అందులోని సూత్రాలు, విలువలతోపాటు రాజ్యాంగ సంస్థలపై ఓ క్రమపద్దతిలో ఈ జీవ శాస్త్రేతర ప్రధాన మంత్రి దాడి చేస్తున్నారంటూ మోదీపై మండిపడ్డారు. మనుస్మృతి స్పూర్తి ప్రేరణతో రూపొందించలేదనే కారణంతో జీవశాస్త్రేతర ప్రధానమంత్రితోపాటు ఆయన పరివారం భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ఈ జీవశాస్త్రేతర ప్రధానమంత్రికి డెమోక్రసి అంటే డెమో క్రుషి అని అర్థమైనట్లుగా ఉందని జైరాం రమేష్ తన ట్విట్‌లో ప్రధాని మోదీపై వ్యంగ్య బాణాన్ని సంధించారు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 06:19 PM

Advertising
Advertising
<