ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress - DMK: తేల్చి చెప్పేసిన డీఎంకే.. కాంగ్రెస్‌కు ఐదు స్థానాలే!

ABN, Publish Date - Feb 28 , 2024 | 10:30 AM

‘ఇండియా’ కూటమిలో క్రియాశీలకంగా వున్న కాంగ్రెస్‌ - డీఎంకే(Congress - DMK) మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం అసంతృప్తి సెగలు పుట్టిస్తోంది.

- అధిష్ఠానాన్ని శరణుజొచ్చిన టీఎన్‌సీసీ

చెన్నై,: ‘ఇండియా’ కూటమిలో క్రియాశీలకంగా వున్న కాంగ్రెస్‌ - డీఎంకే(Congress - DMK) మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం అసంతృప్తి సెగలు పుట్టిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన స్థానాల కన్నా ఈసారి కొన్నింటిని తగ్గిస్తామంటూ కాంగ్రెస్‏కు డీఎంకే చెప్పడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. డీఎంకే కూటమిలో కొంగునాడు మక్కల్‌ కట్చి, ఐయూఎంల్‌లకు ఇప్పటికే డీఎంకే చెరొక స్థానం కేటాయించిన విషయం తెలిసిందే. అదే సమయంలో గతంలో ఒక్కస్థానంలో పోటీ చేసిన ఎండీఎంకే ఈ సారి రెండు స్థానాలను, గతంలో రెండేసిచోట్ల పోటీ చేసిన వామపక్షాలు ఇప్పుడు చెరి మూడు స్థానాలను, గతంలో రెండు స్థానాల్లో పోటీ చేసిన డీపీఐ ఈసారి 4 స్థానాలను అడుగుతోంది. దాంతో డీఎంకే కూటమి చర్చల్లో స్తంభన నెలకొంది. గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కన్నియాకుమారి, విరుదునగర్‌, తిరుచ్చి, ఆరణి, తిరువళ్లూరు, కృష్ణగిరి, తేని, శివగంగ, కరూర్‌, పుదుచ్చేరి కలిపి మొత్తం పది స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ తొమ్మిందింటిలో విజయం సాధించగలిగింది. తేని నియోజకవర్గంలో ఆ పార్టీ పరాజయం పాలైంది. ఆ ఎన్నికల్లో డీఎంకే కూటమి నుంచి పోటీ చేసిన పార్టీలన్నీ వందకు వందశాతం విజయం సాధించగా, కాంగ్రెస్‌ మాత్రమే వెనుకబడిపోయింది. దీంతో ఆ పార్టీకి కూటమిలో స్థానాల సంఖ్య తగ్గించి, తమకు కేటాయించాలంటూ అన్ని పార్టీలు డీఎంకేని డిమాండ్‌ చేస్తున్నాయి. ఆ పార్టీలో నాయకత్వలోపం, సరైన అభ్యర్థుల్లేకపోవడం తదితరాల నేపథ్యంలో కాంగ్రె్‌సకు స్థానాలు తగ్గించడమే మేలని డీఎంకే కూడా భావిస్తోంది. దాంతో ఆ పార్టీకి ఐదు స్థానాలు మాత్రమే ఇస్తామని డీఎంకే స్పష్టం చేసినట్లు తెలిసింది. అంతేగాక తిరునల్వేలి, కన్నియాకుమారి, తిరుచ్చి, తంజావూరు, మైలాడుదురై, కడలూరు, కాంచీపురం, తిరువళ్లూరు, ఆరణి, అరక్కోణం నియోజకవర్గాల్లో ఐదింటిని ఎంపిక చేసుకోవాలని తేల్చిచెప్పింది. బయటకు 12 స్థానాలు కావాలని అడుగుతున్నప్పటికీ గతంలో ఇచ్చిన పది స్థానాలను కేటాయించినా చాలని భావిస్తున్న కాంగ్రెస్ కు డీఎంకే చేసిన సూచన దిగ్ర్భాంతికి గురి చేసింది. దీంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు తమ అధిష్ఠానాన్ని శరణుజొచ్చారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు పెరుందగై నేతృత్వంలోని సీనియర్లు సోమవారమే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ నేతలు ఏఐసీసీ నేతలు వేణుగోపాల్‌, ముకుల్‌ వాస్నిక్‌తో భేటీ అయి విషయం వివరించారు. అంతేగాక మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయి డీఎంకే వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ అభ్యర్థించినట్లు తెలిసింది. దీంతో ఈ విషయాన్ని రాహుల్‌గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లాలని ఖర్గే భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారం రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ డీఎంకే తన నిర్ణయం మార్చుకోకపోతే.. కాంగ్రెస్‌ తగ్గకపోతే పరిస్థితి ఏంటన్నదానిపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఓ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాత్రం ఇదంతా టీకప్పులో తుఫానులాంటిదని, కూటమిలో సీట్ల సర్దుబాటు సాఫీగా ముగుస్తుందని చెప్పడం గమనార్హం.

Updated Date - Feb 28 , 2024 | 10:33 AM

Advertising
Advertising