PM Modi: రాజ్యాంగంపై చర్చలో కాంగ్రెస్ ఫ్యామిలీపై మోదీ చురకలు
ABN, Publish Date - Dec 14 , 2024 | 07:28 PM
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కుటుంబం రాజకీయ ప్రయోజనాల కోసం పదేపదే రాజ్యాంగ సిద్ధాంతాలను బలహీనపరుస్తూ వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని, దేశం గర్వపడే విధంగా ఈరోజు ప్రజాస్వామ్య పండుగను ఎంతో ఘనంగా జరుపుకొంటున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లోక్‌సభలో శనివారం జరుగుతున్న ప్రత్యేక చర్చలో మోదీ పాల్గొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పటిష్టత, మహిళా సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూనే కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీకి చెందిన ఒక కుటుంబం రాజకీయ ప్రయోజనాల కోసం పదేపదే రాజ్యాంగ సిద్ధాంతాలను బలహీనపరుస్తూ వచ్చిందని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కళ్లెం వేస్తూ, అసమ్మతిని అణిచి వేసేందుకు రాజ్యాంగ సవరణలు తెచ్చిందని విమర్శించారు.
Rahul Gandhi: సావర్కర్‌ను అవహేళన చేస్తున్నది మీరు కాదా?: రాజ్యాంగంపై చర్చలో రాహుల్
''రాజ్యాంగం 25 ఏళ్లు పూర్తయినప్పుడు రాజ్యాంగం చిరిగింది. 1975లో అత్యవసర పరిస్థితి (ఎమర్జన్సీ) విధించారు. యావద్దేశాన్ని ఒక జైలుగా మార్చారు. రాజ్యాంగ హక్కులను ఊడలాక్కున్నారు. మీడియాను నోరెత్తనీయలేదు. ప్రజాస్వామ్య ప్రక్రియ మొత్తం అణిచివేతకు గురైంది. కాంగ్రెస్ పార్టీపై పడిన ఈ మరక ఎప్పటి తొలగిపోదు'' అని ప్రధాని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని తారుమారు చేసేందుకు కాంగ్రెస్ బీజాలు నాటిందని, జవహర్ లాల్ నెహ్రూతో మొదలుపెట్టి ఇందిరాగాంధీ హయాం నాటికి పరాకాష్టకు చేరుకుందని, సుప్రీంకోర్టు నిర్ణయాలు తోసిరాజనడం, రాజ్యాంగ సవరణలతో న్యాయవ్యవస్థ రెక్కలు కత్తిరించారని మోదీ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
Akhilesh Yadav: ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించండి: అఖిలేష్
Tamilnadu: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్ కన్నుమూత
Red Fort: ఎర్రకోట మాది.. తిరిగిచ్చేయండి..
జస్టిస్ శేఖర్ యాదవ్‌పై అభిశంసన నోటీసు
For National News And Telugu News
Updated Date - Dec 14 , 2024 | 08:03 PM