Jammu And Kashmir: ప్రభుత్వం ఏర్పాటుకు బేషరతుగా ఎన్‌సీకి కాంగ్రెస్ మద్దతు
ABN, Publish Date - Oct 11 , 2024 | 07:42 PM
జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు నేషనల్ కాన్ఫరెన్స్‌కు కాంగ్రెస్ లాంఛనంగా మద్దతును ప్రకటించింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శ్రీనగర్‌లో శుక్రవారంనాడు జరిపిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో ప్రభుత్వం ఏర్పాటుకు నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference)కు కాంగ్రెస్ (Congress) లాంఛనంగా మద్దతును ప్రకటించింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శ్రీనగర్‌లో శుక్రవారంనాడు జరిపిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరఫున ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా, ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, నిజాముద్దీన్ భట్, పార్జాదా మొహమ్మద్ సయీద్, ఇర్ఫాన్ హఫీజ్ లోనె, ఇఫిక్తార్ అమ్మద్ హాజరయ్యారు. జమ్మూ నుంచి అహ్మద్, తక్కిన వారు కశ్మీర్ నుంచి ఎన్నికయ్యారు.
Haryana: హర్యానాలో బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఇదే
బేషరతుగా మద్దతు
సమావేశానంతరం తారిఖ్ హమీద్ కర్రా మాట్లాడుతూ, ఎలాంటి డిమాండ్లు లేకుండా నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు చెప్పారు. 'ఇండియా' కూటమి స్ఫూర్తికి అనుగుణంగా ఎన్‌సీకి మద్దతు ఇస్తున్నామన్నారు. ఇందులో నెంబర్ గేమ్‌కు కానీ, మంత్రి పదవులకు కానీ తావులేదని, దేశాన్ని కాపాండేందుకు బీజేపీపై జరుపుతున్న పోరాటం మాత్రమేనని అన్నారు. కాగా, సమావేశానంతరం తమ కూటమి భాగస్వామి అయిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు లేఖను కాంగ్రెస్ అందజేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే ఎన్నికకావడం ద్వారా ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.
ఎల్జీని కలుసుకోనున్న ఎన్సీ
ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఎల్జీని కోరేందుకు సమయం అడిగామని, శనివారంనాడు కలిసే అవకాశం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. మద్దతు లేఖలతో వెళ్లి ఎల్జీని కలుస్తామని చెప్పారు. ఆప్ నుంచి కూడా తమకు మద్దతు వచ్చినట్టు తెలిపారు.
For National News And Telugu News
ఇది కూడా చదవండి...
PM Modi: దసరా ఉత్సవాల వేళ.. అమ్మవారి కిరీటం చోరీ
Updated Date - Oct 11 , 2024 | 07:42 PM