ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం..మారనున్న సీఎం?

ABN, Publish Date - Feb 28 , 2024 | 09:15 AM

హిమాచల్‌‌ప్రదేశ్‌లోని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా హిమాచల్‌లో రాజకీయ వేడి పెరిగింది.

హిమాచల్‌‌ప్రదేశ్‌(Himachal Pradesh)లోని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం(Congress government) సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా హిమాచల్‌లో రాజకీయ వేడి పెరిగింది. దీంతో వెంటనే సమాచారం అందుకున్న కాంగ్రెస్ చర్యలకు ఉపక్రమించింది. పార్టీ సీనియర్ నేతలు భూపిందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్‌లను పరిశీలకులుగా నియమించారు. సంక్షోభ పరిస్థితి నేపథ్యంలో హుటాహుటిన పరిశీలకులను కాంగ్రెస్ అధిష్టానం హిమాచల్ ప్రదేశ్‌కు పంపింది. వీరు సిమ్లా చేరుకుని అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు.

అయితే హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల సమయంలో ఆరుగురు కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేశారు. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజయం సాధించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అభిషేక్‌ మను సింఘ్వీని రంగంలోకి దింపగా క్రాస్ ఓటింగ్ జరగకపోతే కాంగ్రెస్ అభ్యర్థి సునాయాసంగా విజయం సాధించేవారు. ఆరుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్, స్వతంత్రుల ఓట్లతో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు 34 ఓట్లు వచ్చాయి.


బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులకు చెరో 34 ఓట్లు రావడంతో టైగా నిలిచింది. గెలుపు నిర్ణయించేందుకు టాస్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఓటమి పాలయ్యారు. దీంతో హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుపై రెబెల్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే మొత్తం సభలో 26 మంది ఎమ్మెల్యేలు సీఎం తీరుపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

నేడు బడ్జెట్ పాస్ చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ ప్రకటించింది. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను ఇప్పటికే ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జైరాం ఠాకూర్ కలిశారు. బలనిరూపణకు ఆదేశించాలని జైరాం ఠాకూర్ గవర్నర్‌ను కోరారు. ఈ క్రమంలో 60 ఎమ్మెల్యేల అసెంబ్లీలో కాంగ్రెస్ సొంతంగా 40 గెల్చుకోగా మరో ముగ్గురు స్వతంత్రుల మద్దతు ఉంది.

కానీ ప్రస్తుతం సభలో బీజేపీ బలం 25 మంది ఎమ్మెల్యేలకు చేరింది. 20 మంది ఎమ్మెల్యేలు సీఎంను మార్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ(BJP) చూస్తుండగా..మరోవైపు ఎమ్మెల్యేలను తిరిగి తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా!

Updated Date - Feb 28 , 2024 | 01:52 PM

Advertising
Advertising