ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls 2024: రాహుల్ సభలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు..

ABN, Publish Date - May 19 , 2024 | 04:30 PM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కాంగ్రెస్ సభలో తొక్కిసలాట జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫుల్‌పూర్‌లో నిర్వహించిన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్ హాజరయ్యారు. ఈ నేతలిద్దరూ వేదికపైకి చేరుకున్న తరువాత.. సభకు వచ్చిన జనం వేదికకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేయగా తొక్కిసలాట జరిగింది.

Rahul gandhi and Akilesh

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కాంగ్రెస్ సభలో తొక్కిసలాట జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫుల్‌పూర్‌లో నిర్వహించిన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్ హాజరయ్యారు. ఈ నేతలిద్దరూ వేదికపైకి చేరుకున్న తరువాత.. సభకు వచ్చిన జనం వేదికకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేయగా తొక్కిసలాట జరిగింది. దీంతో నేతలిద్దరూ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాగానే సభలో జనం బారికేడ్లను బద్దలుకొట్టి వేదికకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేయడంతో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు.


కాంగ్రెస్ సభలో జరిగిన తొక్కిసలాటలో ఓ మీడియా సంస్థకు చెందిన కెమెరా స్టాండ్ కూడా పగిలిపోయింది. తొక్కిసలాటతో గందరగోళం నెలకొనడంతో రాహుల్, అఖిలేష్ ఎలాంటి ప్రసంగం చేయకుండానే వెళ్లిపోయారు. రాహుల్, అఖిలేష్ ఉమ్మడి బహిరంగ సభ ఫూల్పూర్‌లోని పందిలాలో జరగాల్సి ఉంది. ఇద్దరూ నేతలు ఈ సభకు చేరుకున్నప్పటికి తొక్కిసలాట కారణంగా నేతలిద్దరూ ర్యాలీలో ప్రసంగించకుండా వెనుదిరిగారు.

PM Modi: ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు


ప్రయాగ్‌రాజ్‌, ఫుల్‌పూర్‌ అభ్యర్థుల తరపున..

ప్రయాగ్‌రాజ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి, ఫూల్‌పూర్‌లో ఎస్పీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. వీరిద్దరికీ మద్దతుగా ఈ ఉమ్మడి ఎన్నికల సభ నిర్వహించారు. ఎస్పీ అభ్యర్థి అమర్‌నాథ్ మౌర్యకు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించేందుకు ఇద్దరు నేతలు వచ్చారు. అయితే ఈ ర్యాలీలో తొక్కిసలాట జరిగడంతో సభా ప్రాంగణం నుంచి ఇద్దరు నేతలు వెళ్లిపోయారు. పార్టీ కార్యకర్తలు శాంతించాలని అఖిలేష్, రాహుల్ పదేపదే అభ్యర్థించినప్పటికీ వారి విజ్ఞప్తులు పట్టించుకోలేదు. ఉత్సాహంగా ఉన్న జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు, భద్రతా సిబ్బంది నానా తంటాలు పడ్డారు. పార్టీ శ్రేణులకు అనేక విజ్ఞప్తులు చేసిన తర్వాత, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ఇద్దరూ వేదికపై కొద్దిసేపు చర్చలు జరిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఇద్దరు నేతలు సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.


West Bengal: ఓ వర్గం ఓట్లు పొందేందుకు రామకృష్ణ మిషన్‌పై దాడి.. దీదీపై మోదీ విమర్శలు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National News and Telugu News

Updated Date - May 19 , 2024 | 04:30 PM

Advertising
Advertising