ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: గాంధీపై మోదీ వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ విద్యార్థి సర్టిఫికేట్ అక్కర్లేదని రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్

ABN, Publish Date - May 30 , 2024 | 09:57 AM

మహాత్మా గాంధీపై(Mahatma Gandhi) ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘‘ఈ విషయంలో నన్ను క్షమించండి..! 1982లో రిచర్డ్‌ అటెన్‌బరో చలనచిత్రం ‘గాంధీ’ విడుదలయ్యే వరకు కూడా ప్రపంచానికి గాంధీ గురించి తెలియదు.

ఢిల్లీ: మహాత్మా గాంధీపై(Mahatma Gandhi) ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘‘ఈ విషయంలో నన్ను క్షమించండి..! 1982లో రిచర్డ్‌ అటెన్‌బరో చలనచిత్రం ‘గాంధీ’ విడుదలయ్యే వరకు కూడా ప్రపంచానికి గాంధీ గురించి తెలియదు. గాంధీ ఓ గొప్ప వ్యక్తి. మార్టిన్‌ లూథర్‌కింగ్‌, నెల్సన్‌ మండేలా వంటి మహానుభావుల కంటే గాంధీజీ తక్కువేం కాదు. 75 ఏళ్లుగా అలాంటి వ్యక్తిని ప్రపంచం గుర్తించేలా చేయడం మన బాధ్యత కాదా?’’ అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ఏబీపీ న్యూస్‌ నెట్‌వర్క్‌ ప్రతినిధులు రోహిత్‌ సావల్‌, రోమన ఇసర్‌ ఖాన్‌, సుమన్‌ డేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్ష ఇండియా కూటమి భారత సంస్కృతి, విలువలను అర్థం చేసుకుంటోందా? అని వారు అడిగిన ప్రశ్నలకు మోదీ(PM Modi) పైవిధంగా స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహాత్మాగాంధీని ప్రమోట్‌ చేయలేకపోయింది. గడిచిన గాంధీ సినిమా వచ్చేవరకు ప్రపంచానికి ఆయన గురించి తెలియకపోవడం విచారకరం’’ అని మోదీ అన్నారు.


రాహుల్ ఏమన్నారంటే..

మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఖండించారు. మహాత్మాగాంధీ గురించి తెలుసుకోవాలంటే పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ మాత్రమే సినిమా చూడాలని పేర్కొన్నారు. "మహాత్మాగాంధీ ప్రపంచానికి అంధకారానికి వ్యతిరేకంగా పోరాడే శక్తిని అందించిన సూర్యుడు. బాపు అన్యాయాన్ని ఎదిరించే బలహీనమైన వ్యక్తికి కూడా సత్యం, అహింస రూపంలో ధైర్యం కలిగించే మార్గాన్ని చూపించారు. ఆర్ఎస్ఎస్ విద్యార్థి నుంచి గాంధీజీకి ఎలాంటి సర్టిఫికేట్ అక్కర్లేదు. గాంధీ మార్టిన్‌ లూథర్‌కింగ్‌, మండేలాకు తక్కువేం కాదు"అని రాహుల్ అన్నారు.


భగ్గుమన్న నేతలు..

గాంధీ సినిమా వచ్చేవరకు కూడా మహాత్ముడి గురించి ప్రపంచానికి తెలియదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు భగ్గుమన్నారు. ‘‘మహాత్మాగాంధీ గొప్పదనాన్ని ప్రశ్నించేవారు, విమర్శించేవారు ఎవరైనా ఉంటారంటే.. అది వెళ్లిపోయే ప్రధాని మాత్రమే. ఆయన(మోదీ) ప్రభుత్వం వారాణసీ, న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌లలో ఉన్న గాంధేయ విద్యాసంస్థలను నాశనం చేసింది. అది ఆరెస్సెస్‌ హాల్‌మార్క్‌కు నిదర్శనం. గాడ్సే సిద్ధాంతాలను అనుసరించేవారికి గాంధీ జాతీయవాదం గురించి తెలియదు.

మోదీ, గాడ్సే భక్తులు అధికారం నుంచి దిగిపోవడం ఖాయం’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ అంశంపై రాహుల్‌గాందీ కూడా తీవ్రంగా స్పందించారు. ‘‘కేవలం ఒక్క పొలిటికల్‌ సైన్స్‌ విద్యార్థి(ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ల వివాదాన్ని ఉద్దేశించి) మాత్రమే సినిమాను చూసి, గాంధీజీ గురించి తెలుసుకుంటారు’’ అని ఎద్దేవా చేశారు.

For Latest News and National News click here..

Updated Date - May 30 , 2024 | 09:58 AM

Advertising
Advertising